మా ఆయనకు మాత్రమే కనిపించే ప్లేస్ లో...!

Wed Jan 02 2019 07:00:02 GMT+0530 (IST)

బుల్లి తెర నుండి వెండి తెరకు వచ్చిన కలర్స్ స్వాతి తెలుగు ప్రేక్షకులను హీరోయిన్ గా ఎక్కువ కాలం మెప్పించలేక పోయింది. తెలుగులో కంటే ఈమెకు ఇతర భాషల్లోనే హీరోయిన్ గా మంచి గుర్తింపు దక్కింది. తెలుగులో ఈమె హీరోయిన్ గా మంచి పేరు తెచ్చుకునేందుకు తీవ్రంగానే ప్రయత్నించి విఫలం అయ్యింది. సినిమాల్లో ఆఫర్లు రాని సమయంలో ప్రేమించిన వికాస్ ను వివాహం చేసుకుంది. ఇంటర్నేషనల్ ఫైలెట్ అయిన వికాస్ ఇండోనేషియాలో ఉంటున్నాడు. ఆయనతో పాటు స్వాతి కూడా అక్కడే ప్రస్తుతం ఉంటుంది.కొత్త సంవత్సరం సందర్బంగా స్వాతి ఒక తెలుగు టీవీ ఛానెల్ కు ఇంటర్వ్యూ ఇచ్చింది. ఆ ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలను చెప్పుకొచ్చింది.. ప్రస్తుతం పెద్ద దర్శకులు - చిన్న దర్శకులు అంటూ ఏమీ లేదు. పెద్ద దర్శకులు ఫ్లాప్ లు తీస్తున్నారు - చిన్న దర్శకులు సక్సెస్ లు తీస్తున్నారు. అందుకే నాకు డ్రీమ్ డైరెక్టర్ అంటూ ఎవరు లేరు. నాకు ఎక్కువగా వచ్చే పంచ్ లైన్ నీ బొందరరేయ్ - దీన్ని నేను ఎక్కువగా వాడుతూ ఉంటాను. నా మిడిల్ ఫింగర్ పై టాటూ ఉంటుంది. నన్ను ఎవరైనా కామెంట్ చేసినప్పుడు దాన్ని చూపుతాను. మరో టాటూ వేయించుకోవాల్సి వస్తే మాత్రం అది మా ఆయనకు మాత్రమే కనిపించేలా - మరెవ్వరికి కనిపించని ప్లేస్ లో వేయించుకుంటాను.

నేను మనుషులను ఈజీగా నమ్మేస్తాను అదే నేను జీవితంలో చేసే పెద్ద తప్పు. పదే పదే అదే తప్పు చేస్తూ ఉంటాను. నేను బుల్లి తెరపై కలర్స్ కార్యక్రమం చేస్తున్న సమయంలో సెక్స్ టేపులు అంటూ నా గురించి పుకార్లు రావడం చాలా బాధ వేసింది. నా పన్ను పై పన్ను ఉండటం గురించి సెట్ లో కొందరు మాట్లాడుకుంటూ ఉంటే బాదేసేది. ఇక నిఖిల్ తో తనకున్న రిలేషన్ షిప్ పై పలువురు పలు రకాలుగా అనుకుంటున్నారు. కాని నాకు నిఖిల్ ఎప్పటికి ఒక మంచి స్నేహితుడు. నిఖిల్ ఎప్పుడు నాతో లిమిట్స్ దాటలేదు అంటూ చెప్పుకొచ్చింది.