Begin typing your search above and press return to search.

ఫోటో స్టోరి: స్వాతి యోగాలు చూడతరమా

By:  Tupaki Desk   |   26 Sep 2016 4:36 PM GMT
ఫోటో స్టోరి: స్వాతి యోగాలు చూడతరమా
X
'త్రిపుర' అనే సినిమా తరువాత కనీసం సినిమా ఫంక్షన్లలో కూడా కనిపించడం మానేసింది కలర్స్ స్వాతి. అమ్మడుని అందరూ బొద్దుగా ఆంటీలా ఉన్నావ్ అంటూ కామెంట్లు చేయడంతో.. ఎలాగైనా కూడా సైజ్ తగ్గిన తరువాతే తదుపరి ప్రాజెక్టులకు సంతకం చేస్తా అంటూ మడికట్టుకొని కూర్చుంది. అయితే పెరిగినంత ఈజీగా కాదుగా తగ్గడం అంటే.. అందుకే సంవత్సరం నుండి అమ్మడు మెయిన్ స్ర్టీమ్ లో మిస్సయిపోయింది.

అదిగో ప్రస్తుతం బాగానే వెయిట్ తగ్గిపోయిన స్వాతి.. ఇప్పుడు యోగా ద్వారా తన ఫిజిక్ ను ఇంకాస్త కంట్రోల్లోకి తెచ్చేస్తోందట. అయితే మామూలుగా యోగా సూట్ వేసుకుని ఇలాంటివి చేస్తుంటారు.. కాని కలర్స్ పాపాయ్ మాత్రం పక్కా పక్కింటి అమ్మాయి టైపులో మామూలు డ్రస్సులోనే యోగా షురూ చేసింది. భం చిక్ భం చిక్ చెయ్యి బాగా అంటూ ఈ మామూలు డ్రస్సులోనే పాటేసుకుంది. ఇంత సీరియస్ గా యోగా చేస్తూ కొవ్వును కట్ చేసింది కాబట్టి.. మరి మనోళ్ళు స్వాతిని మరోసారి ఆఫర్లతో ముంచెత్తుతారా?

నిజానికి స్వాతి, అంజలి, శ్రీదివ్య, బింధుమాదవి వంటి బ్యూటీలకు తెలుగులో ఆఫర్లు వచ్చి.. వీరందరూ ఇక్కడే స్టార్ హీరోయిన్లుగా వెలుగొందితే.. ఆ కిక్కే వేరబ్బా!!