Begin typing your search above and press return to search.

దీపికతో లిఫ్ట్ లో ఇరుక్కుపోతే..

By:  Tupaki Desk   |   23 April 2017 5:16 AM GMT
దీపికతో లిఫ్ట్ లో ఇరుక్కుపోతే..
X
దీపికా పదుకొనే లాంటి టాప్ బ్యూటీతో.. ఆ హోటల్ రూమ్ బోయ్ లిఫ్ట్ లో ఇరుక్కుపోతే ఎలా ఉంటుంది.. ఆలోచనే వెరైటీగా ఉంది కదూ! దీన్నే థీమ్ గా తీసుకుని ఓ యాడ్ ను తీసేసింది ఓ కూల్ డ్రింక్ కంపెనీ. రూమ్ సర్వీస్ చేసేందుకు వెళ్తుండగా.. ఆఖరి నిమిషంలో లిఫ్ట్ లోకి వచ్చేస్తుంది దీపిక.

కరెంట్ పోవడం.. లిఫ్ట్ ఆగిపోవడం వంటివి జరిగిపోయాక.. ఉక్కపోత నుంచి తప్పించుకోవడానికి.. దీపికకు కూల్ డ్రింగ్ ఆఫర్ చేస్తాడు రూమ్ బోయ్. చిన్నగా డ్యాన్స్ వేయడం చూసిన దీపిక.. ఇక లిఫ్ట్ లోనే తన ఫోన్ లో సాంగ్ ఆన్ చేస్తుంది. ఇద్దరూ కలిసి తెగ డ్యాన్సులు వేసి టైం స్పెండ్ చేసేస్తారు. లిఫ్ట్ సర్వీస్ మెన్ వచ్చేసరికి కూడా వీళ్లు డ్యాన్సులు వేస్తూనే ఉంటారు. ఆఖరిలో హీరోయిన్ తో కలిసి సెల్ఫీ తీసుకుంటాడు కుర్రాడు. తీరా ఆ తర్వాత ఫోటో చూసుకుంటే దీపికా ఫేస్ కి డ్రింక్ బాటిల్ అడ్డొస్తుందన్న మాట. ఇదంతా వీడియోలో కూడా ఉంటుంది కానీ.. యాడ్ లో దీపిక ఎనర్జీ లెవెల్స్ మాత్రం అదరహో అనాల్సిందే.

నిజంగానే దీపికతో లిఫ్ట్ లో ఇరుక్కుపోతే మాత్రం ఇంతకంటే ఎంజాయ్ మెంట్ ఎవరికీ ఉండదులే. అంతకంటే ఎక్కువ ఎక్స్ పెక్ట్ చేయలేం కదా. కాకపోతే ఈ యాడ్ ఘోరంగా ఉందంటూ ఇప్పుడు నెటిజన్లు తెగ రచ్చ చేస్తున్నారు.



Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/