Begin typing your search above and press return to search.

మెగా రూమర్స్ గురించి క్లారిటీ

By:  Tupaki Desk   |   18 Jun 2019 7:57 AM GMT
మెగా రూమర్స్ గురించి క్లారిటీ
X
అల్లు అర్జున్ త్రివిక్రమ్ కాంబినేషన్ లో రూపొందుతున్న సినిమాలో కమెడియన్ పృథ్విని తప్పించారన్న టాక్ ఇవాళ బలంగా వినిపించింది. ఫిలిం నగర్ లో దీని గురించిన ప్రస్తావన కాస్త హాట్ గానే రావడంతో బాగానే వైరల్ అయ్యింది. వైసిపి తరఫున ఎన్నికల ప్రచారంలో పృథ్వి జనసేన మీద అనుచిత వ్యాఖ్యలు చేశాడన్న కారణంతో బన్నీ త్రివిక్రమ్ ఈ నిర్ణయం తీసుకున్నారని పలు మీడియా వర్గాల్లో కూడా వచ్చింది.

కానీ తాజాగా అందిన సమాచారం మేరకు వాస్తవం వేరుగా ఉందట. ఇదే సినిమాలో పోసాని కూడా ఓ కీలక పాత్ర చేస్తున్నారు. ఈయనకు పృథ్వి కాంబినేషన్ లో కీలకమైన సీన్లు ఉన్నాయి. కానీ ఇటీవలే పోసాని అస్వస్ధతకు గురి కావడంతో కొంత కాలం రెస్ట్ తీసుకోవలసిన పరిస్థితి. దీంతో అప్పటికే షూట్ చేసిన కాంబో సీన్లు వేరే ఆర్టిస్టుతో మళ్ళి తీయాలి. పృథ్వి ఇంకోసారి డేట్స్ ఇస్తే తప్ప అది సాధ్యపడదు

కానీ చేతిలో ఉన్న వేరే సినిమాలకు డేట్స్ ఇచ్చేసిన కారణంగా దీనికి మరోసారి ఇవ్వలేని నిస్సహాయతను పృథ్వి వ్యక్తం చేయడంతో అతన్ని తప్పనిసరి పరిస్థితుల్లో తప్పించి ఆ ఇద్దరి స్థానంలో కొత్త ఆర్టిస్టులతో రీ షూట్ చేయబోతున్నారని తెలిసింది. కానీ ఈ మధ్యలో జరిగిన కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల అది ఇంకో రకంగా ప్రచారంలోకి వచ్చింది. మెగా హీరోస్ ఎప్పుడూ రాజకీయాలకు సినిమాలకు ముడిపెట్టరని అందరికి తెలిసినా ఇలా స్ప్రెడ్ కావడం విచిత్రమే. మొత్తానికి దీనికి సంబంధించి క్లారిటీ అయితే వచ్చేసింది. రీ ప్లేస్ అవ్వబోతున్న ఆర్టిస్టులు ఎవరో ఇంకా తెలియాల్సి ఉంది