Begin typing your search above and press return to search.

ఎన్టీఆర్ కోసం టాప్ క్లాస్ కెమెరామన్

By:  Tupaki Desk   |   26 Nov 2015 10:06 AM GMT
ఎన్టీఆర్ కోసం టాప్ క్లాస్ కెమెరామన్
X
తన తొలి రెండు సినిమాలకు దాదాపుగా ఒకే టెక్నికల్ టీంతో పని చేశాడు కొరటాల శివ. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తే.. మధి సినిమాటోగ్రఫీ అందించాడు. ఈ రెండు సినిమాల్లోనూ మధి ఛాయాగ్రహణం హైలైట్‌ గా నిలిచింది. సినిమాకు అది పెద్ద ప్లస్ పాయింట్‌ అయింది. ఐతే కొరటాల తర్వాతి సినిమాకు మధి అందుబాటులో లేడు. అతడికి వేరే కమిట్ మెంట్ లు ఉండటం.. ఎన్టీఆర్‌ తో కొరటాల సినిమా అనుకున్న సమయానికి మొదలు కాకపోవడంతో మధి ఈ మూవీ చేయలేకపోయాడు. ఐతే మధి మిస్సయినా మరో హాట్ షాట్ కెమెరామన్‌ ను తెలుగులోకి తీసుకొస్తున్నాడు కొరటాల.

బాలీవుడ్ - కోలీవుడ్ లలో పెద్ద పెద్ద సినిమాలు చేసిన తిరు ఎన్టీఆర్-కొరటాల సినిమాకు ఛాయాగ్రహణం అందిస్తున్నాడు. కమల్ హాసన్ సినిమా ‘హేరామ్’తో బాలీవుడ్ అరంగేట్రం చేసి.. అటు హిందీలో ఇటు తమిళంలో ఆలవందాన్ - భూల్ బులాయియా - కాంజీవరం - క్రిష్-3 లాంటి సినిమాలతో దేశంలోని టాప్ సినిమాటోగ్రాఫర్లలో ఒకడిగా ఎదిగిన తిరును తన సినిమాకు కొరటాల ఒప్పించడం విశేషమే. తెలుగులో అతను చేయబోయే తొలి సినిమా ఇదే. ఈ చిత్రంలో మోహన్ లాల్ కీలక పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. దేవిశ్రీ,. కొరటాలతో వరుసగా మూడో సినిమా చేయబోతున్నాడు. కొరటాలతో శ్రీమంతుడు తీసిన నిర్మాతలే ఈ చిత్రాన్ని కూడా నిర్మించబోతున్నారు.