Begin typing your search above and press return to search.

చుట్టాలబ్బాయ్.. రెడీ అవుతున్నాడు

By:  Tupaki Desk   |   24 May 2016 7:30 PM GMT
చుట్టాలబ్బాయ్.. రెడీ అవుతున్నాడు
X
భాయ్ సినిమా నిరాశపరచడంతో... చాలా కాలం గ్యాప్ తీసుకున్న దర్శకుడు వీరభద్రమ్ చౌదరి.. ఇప్పుడు డైలాగ్ కింగ్ సాయికుమార్ తనయుడు ఆదితో కలిసి చుట్టాలబ్బాయ్ మూవీని తెరకెక్కిస్తున్నాడు. తను ముందు నుంచి నమ్ముకున్న ఫ్యామిలీ ఎంటర్టైనర్ తోనే ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ఇందులో హీరో ఆది రికవరీ ఏజెంట్ గా నటిస్తున్నాడు. అతని తండ్రి సాయికుమార్ కూడా ఓ ముఖ్యపాత్ర ఇందులో పోషిస్తున్నాడు. ఇప్పటి వరకూ తండ్రీ కొడుకులు కలిసి నటించింది లేదు. తొలిసారిగా ఈ మూవీలో నటిస్తున్నారు. భాయ్ సినిమా రిజల్టుతో డీలా పడ్డ దర్శకుడు వీరభద్రం... ఈసారి మాత్రం ఈ మూవీని ఎంతో జాగ్రత్తగా తెరకెక్కిస్తున్నాడు. హీరో ఆదికి కూడా వరుస పరాజయాలే పలకరించాయి. దాంతో అతనికీ ఈ చిత్ర విజయం ఎంతో కీలకమే.

ఇటీవలే చిత్రం టాకీ పార్ట్ మొత్తం పూర్తయింది. ఓ పాట మాత్రమే మిగిలుంది. దీనిని తనకెంతో సెంటిమెంట్ అయిన శంషాబాద్ లో తెరకెక్కించడానికి దర్శకుడు నిర్మాతలతో కలిసి ప్లాన్ చేస్తున్నారు. నిన్నటి నుంచే ఈ చిత్రం డబ్బింగ్ కూడా ప్రారంభమైంది. అన్ని కుదిరితే వచ్చే నెలాఖరుకు విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఇందులో నమిత ప్రమోద్ హీరోయిన్ గా నటిస్తోంది. ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న ఈ సినిమాతోనైనా.. దర్శకుడికి.. హీరోకి దశ తిరుగుతుందేమో చూద్దాం!