Begin typing your search above and press return to search.

చుట్టాలబ్బాయ్.. కొంచెం బెటరేనండీ

By:  Tupaki Desk   |   23 Aug 2016 3:30 PM GMT
చుట్టాలబ్బాయ్.. కొంచెం బెటరేనండీ
X
వరుసగా రెండు వారాలు.. రెండేసి సినిమాలు.. అన్నీ కూడా నిరాశ పరిచినవే. ‘బాబు బంగారం’కు కాలం కలిసొచ్చి కలెక్షన్ల పంట పండించుకుంది కానీ.. ఆ సినిమా కూడా ప్రేక్షకుల్ని నిరాశ పరిచింది. ఇక గత శుక్రవారం రిలీజైన రెండు సినిమాలూ కూడా నెగెటివ్ టాక్ తోనే మొదలయ్యాయి. వరుస ఫ్లాపులతో సతమతమవుతూ.. ఎన్నో ఆశల మధ్య ఆది.. సుశాంత్ తమ సినిమాల్ని రిలీజ్ చేశారు. కానీ చుట్టాలబ్బాయి.. ఆటాడుకుందాం రా రెండూ కూడా నిరాశ పరిచాయి. దేనికీ మంచి టాక్ రాలేదు. కాకపోతే ఉన్నంతలో ‘చుట్టాలబ్బాయి’ పరిస్థితి మెరుగ్గా కనిపిస్తోంది.

‘ఆటాడుకుందాం రా’ దారుణమైన ఫలితాన్నందుకుంది. ఈ సినిమాకు కలెక్షన్లు తొలి రోజే పూర్తిగా డ్రాప్ అయ్యాయి. సుశాంత్ కెరీర్లోనే అతి పెద్ద డిజాస్టర్ అయ్యిందీ సినిమా. చాలా చోట్ల వీకెండ్ తర్వాత ఈ సినిమాను థియేటర్ల నుంచి లేపేశారు. చుట్టాలబ్బాయి మాత్రం ఓ మోస్తరుగా ఆకట్టుకుంటోంది. థియేటర్లలో జనాలు కనిపిస్తున్నారు. ఆది గత సినిమాలతో పోలిస్తే దీని పరిస్థితి మెరుగే అనొచ్చు. ప్రమోషన్ బాగా చేస్తుండటం కొంచెం కలిసొస్తోంది. ఐతే ఆది ఆశించిన ఫలితమైతే వచ్చే అవకాశం లేదు. చివరికి సినిమా ఏవరేజ్ స్థాయిని అందుకున్నా అందుకు సంతోషించాల్సిందే. వీరభద్రం చౌదరి దర్శకత్వం వహించిన ఈ సినిమాను రామ్.. వెంకట్ అనే కొత్త నిర్మాతలు నిర్మించారు.