Begin typing your search above and press return to search.

ఆ విలన్ కూతురే హాట్ స్టూడెంటా?

By:  Tupaki Desk   |   22 Nov 2017 1:30 AM GMT
ఆ విలన్ కూతురే హాట్ స్టూడెంటా?
X
ప్రస్తుతం బాలీవుడ్ లో ఒక సినిమా గురించి హాట్ హాట్ గా చర్చ జరుగుతోంది. ముఖ్యంగా యూత్ ఆ సినిమా కోసం చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఆ సినిమా మరేదో కాదు. స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ '2'. ఆ మధ్యన వచ్చిన స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ సినిమాకు సీక్వెల్ గా రాబోతోంది. ఆ సినిమా ఏ స్థాయిలో కలెక్షన్స్ ను సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే ఇప్పుడు ఆ సినిమాకు సీక్వెల్ గా వస్తోన్న కథలో టైగర్ ష్రాఫ్ అసలు కథానాయకుడిగా కనిపించబోతున్నాడు.

రీసెంట్ గా చిత్ర నిర్మాత కరణ్ జోహార్ ఫస్ట్ లుక్ ని కూడా రిలీజ్ చేశాడు. దీంతో బాలీవుడ్ ఆడియెన్స్ నుంచి సోషల్ మీడియాలో పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. ఇక ఇప్పుడు సినిమాలో హీరోకి జోడిగా నటించేది ఎవరని ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. అయితే సినిమాలో కొత్త హీరోయిన్ ని మాత్రమే సలెక్ట్ చేయాలనీ చిత్ర యూనిట్ భావిస్తోందట. అందులో ఓ ముగ్గురి సీనియర్ నటుల కూతుళ్ల పేర్లు బాగా వినిపిస్తున్నాయి. అయితే కరణ్ జోహార్ మాత్రం విలన్ పాత్రల స్పెషలిస్ట్ చుంకి పాండే కూతురు అనన్య పాండేని ఈ సినిమాలో హాట్ గా (గతంలో ఆలియా భట్ చేసిన పాత్రలాంటిది) కనిపించే స్టూడెంట్ పాత్రకు సెలెక్ట్ చేసినట్లు తెలుస్తోంది. చిత్ర యూనిట్ మొత్తం కూడా అమ్మడు చాలా అందంగా ఉంటుందని ఒకే చెప్పేశారట. అనన్య కు సోషల్ మీడియాలో మంచి ఫాలోవర్స్ ఉన్నారు. చాలా క్యూట్ అండ్ లవ్లీగా ఉంటుందని అభిమానుల నుంచి బిరుదులను కూడా అందుకుంది. ఇక అమ్మడే ఫైనల్ అయ్యేలా ఉందని తెలుస్తుంది.

ఇకపోతే శ్రీదేవి కూతురు జాన్హవిని కూడా మొదట అనుకున్నారట. కానీ ఆ బ్యూటీ ప్రస్తుతం ధఢఖ్ సినిమాతో బిజీగా ఉంది. ఇక సైఫ్ అలీ ఖాన్ కూతురు సారా అలీ ఖాన్ ని కూడా అనుకున్నారు. కానీ ఆమె ప్రస్తుతం కేదార్నాథ్ సినిమా చేస్తోంది. ఇక ప్రస్తుతం అనన్య ఖాళీగా ఉండడంతో స్క్రీన్ ఎంట్రీ చేయించాలని చూస్తున్నారు. ఇక సినిమాలో మరో హీరోయిన్ క్యారెక్టర్ కూడా ఉందట. అయితే అందుకు మరో కొత్త భామను వెతికే పనుల్లో చిత్ర యూనిట్ ఉందని తెలుస్తోంది.