Begin typing your search above and press return to search.

ఓ మైగాడ్.. కాజ‌ల్‌ కి షాకింగ్ చుమ్మా!

By:  Tupaki Desk   |   12 Nov 2018 12:47 PM GMT
ఓ మైగాడ్.. కాజ‌ల్‌ కి షాకింగ్ చుమ్మా!
X
ఒక్కోసారి ఊహించ‌నివి జ‌రుగుతుంటాయి. ఆవేశంలోనో.. ఆనందంలోనే .. ఉద్వేగంలోనో.. ఉల్లాసంలోనో అనుకోని విధంగా అవ‌త‌లి వారిపై ప్రేమ పుట్టుకొచ్చేస్తుంటుంది. ఆ ప్రేమ కాస్తా ల‌టుక్కున ఛుమ్మాగా మారితేనే కాస్తంత షాకింగ్ స‌ర్‌ ప్రైజ్ ఆడియెన్‌ కి దొరుకుతుంది. అలాంటి స‌ర్‌ ప్రైజ్‌ నే ఇచ్చాడు సీనియ‌ర్ ఛాయాగ్రాహ‌కుడు చోటా.కె.నాయుడు.

చోటా.కె ఈరోజు `క‌వ‌చం` ప్ర‌మోష‌న్ కార్య‌క్ర‌మంలో అందాల చంద‌మామ కాజ‌ల్‌ కి ఇచ్చిన చుమ్మా అలాంటిలాంటిది కాదు. ఓవైపు త‌న‌ని .. త‌న కెమెరా ప‌నిత‌నాన్ని విప‌రీతంగా పొగిడేస్తున్న కాజ‌ల్‌ ని ఆ ప‌క్క‌నే ఉన్న చోటా.కె వేదిక‌పైనే ముద్దాడేశారు. అది ఉద్ధేశ‌పూర్వ‌క‌మైన కిస్సా లేక ఇంకేదైనా అన్న‌ది అటుంచితే ఆ క్ష‌ణం కాజ‌ల్ స్టన్న‌యిపోవ‌డం చూసిన‌వారికి అర్థ‌మైంది. అయితే త‌న‌ని పొగిడేసిన కాజ‌ల్‌ చోటా కె.నాయుడుతో క‌లిసి ప‌ని చేయ‌డం ఇప్పుడే కొత్తేం కాదు. ఇప్పటికే అర‌డ‌జ‌ను పైగానే సినిమాలు చేసింది. ప్ర‌తిసారీ వేదిక‌ల‌పై కాజ‌ల్ అంద‌చందాల్ని ఆయ‌న పొగిడేయ‌డ‌మే కాదు.. అలాంటి ప్ర‌తిభావ‌నిని తాను ఎప్పుడూ చూడ‌లేద‌ని చెబుతుంటారు. ఈరోజు మాత్రం కాజ‌ల్‌ ని య‌థాలాపంగా ఉద్వేగంలో అలా ముద్దాడేశారు. అయితే దానిని కాజ‌ల్ అంతే హుందాగా తీసుకున్నారు కానీ, ఎక్క‌డా డాంబికాల‌కు పోలేదు. అంతేకాదు చోటా.కెపై త‌న‌కు ఉన్న అభిమానం కొద్దీ.. ఆయ‌న మా ఫ్యామిలీ మెంబ‌ర్ .. ఇదేమీ ప‌ట్టించుకోకండి అంటూ క‌వ‌ర్ చేసేసింది.

మొత్తానికి ఇది మీటూ-ఇండియా సీజ‌న్. ఎవ‌రైనా బీరాలు పోయే హీరోయిన్ అయితే ఈపాటికి నానా ర‌చ్చ చేసేదే. కాజ‌ల్ ఎంతో డిగ్నిఫైడ్ కాబట్టి కాస్తంత అవ‌త‌లివైపు స‌న్నివేశం అర్థం చేసుకుని.. ఆనందంలో జ‌రిగిన‌ది అని స‌రిపెట్టుకుంది. ఇంత‌కీ ఆ ముద్దు ఎక్క‌డ‌.. అంటే అందుకు లైవ్ వీడియోలే సాక్ష్యం .