Begin typing your search above and press return to search.

సాంగ్ ప్రోమో: ఫుల్ జోష్ లో మజ్ను

By:  Tupaki Desk   |   15 Jan 2019 4:33 PM GMT
సాంగ్ ప్రోమో: ఫుల్ జోష్ లో మజ్ను
X
అఖిల్ అక్కినేని హీరోగా నటిస్తున్న చితం 'Mr. మజ్ను' ఆడియో ఆల్బమ్ ఈమధ్యనే విడుదలయిన సంగతి తెలిసిందే. సంగీత దర్శకుడు థమన్ అందించిన ఈ మ్యూజిక్ ఆల్బమ్ సంగీత ప్రియులను ఆకట్టుకుంటోంది. తాజాగా సంక్రాంతి సందర్భంగా ఈ సినిమానుండి 'చిరు చిరు నవ్వుల' సాంగ్ వీడియో ప్రోమో ను విడుదల చేశారు.

ఇదో ఫ్యామిలీ సాంగ్. కుటుంబంలో జరిగే పెళ్ళికి అఖిల్ ఫుల్ జోష్ లో అందరితో కలిసి డ్యాన్స్ చేస్తూ కనిపించాడు. కుర్తా పైజమా లాంటి ట్రెడిషనల్ డ్రెస్సుల్లోనే కాదు చొక్కా ధోవతి కండువా తో అచ్చతెలుగు అబ్బాయిలా కూడా కన్పించాడు. ఈ ఉత్సాహంలో నాగబాబు.. రావు రమేష్.. రాధా రవి లాంటి చాలామంది క్యారెక్టర్ ఆర్టిస్టులతో కలిసిమెలిసి హంగామా చేశాడు. ఈ పాటను కలర్ఫుల్ గా.. రిచ్ గా ఉండే ఒక పెళ్ళి మండపంలో చిత్రీకరించడంతో ఒక్కసారి చూడగానే ఆకట్టుకునేలా ఉంది. కొన్ని షాట్స్ లో పెద్ద షాండ్లియర్లు.. మన చూపును పక్కకు తిప్పుకోనివ్వకుండా చేస్తాయి. ఈ పాటలో అఖిల్ డ్యాన్స్ కూడా చాలా బాగుంది.

ఈ సినిమాలో అఖిల్ కు జోడీగానిధి అగర్వాల్ నటిస్తోంది. 'తొలి ప్రేమ' ఫేమ్ వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం జనవరి 25 న ప్రేక్షకుల ముందుకు రానుంది. టీజర్.. ప్రోమోలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న 'Mr. మజ్ను' బాక్స్ ఆఫీస్ దగ్గర కూడా మ్యాజిక్ చేస్తుందేమో వేచి చూడాలి.