Begin typing your search above and press return to search.

ఫోటో స్టోరీ: నిండుగా మెగాఫ్రేమ్‌

By:  Tupaki Desk   |   21 Sep 2018 4:12 AM GMT
ఫోటో స్టోరీ: నిండుగా మెగాఫ్రేమ్‌
X
మెగాప‌వ‌ర్‌ స్టార్ రామ్‌ చ‌ర‌ణ్ - బోయ‌పాటి - దాన‌య్య బృందం ప్ర‌స్తుతం అజ‌ర్‌ భైజాన్‌ లో షూటింగ్ చేస్తూ బిజీగా ఉన్న సంగ‌తి తెలిసిందే. చెర్రీ త‌న కెరీర్ బెస్ట్ యాక్ష‌న్ స‌న్నివేశాల్లో న‌టిస్తున్నాడ‌న్న స‌మాచారం ఉంది. పారా గ్లైడింగ్ లాంటి ప్ర‌మాద‌క‌ర సాహ‌సాల్ని చేస్తున్నాడు. ఇటీవ‌ల అజ‌ర్‌ భైజాన్ లొకేష‌న్ నుంచి కొన్ని ఫోటోల్ని - వీడియోల్ని ఉపాస‌న అభిమానుల‌కు షేర్ చేశారు.

నిన్న‌నే మెగాస్టార్ చిరంజీవి త‌న‌యుడు చ‌ర‌ణ్‌ లొకేష‌న్‌ లో ఎంట్రీ ఇచ్చి స‌డెన్ స‌ర్‌ ప్రైజ్‌ ని ఇచ్చారు. చెర్రీతో చిరు - దాన‌య్య‌తో చిరు ఫోటోలు ప్ర‌స్తుతం మెగాభిమానుల స‌మాజిక మాధ్య‌మాల్లో జోరుగా వైర‌ల్ అవుతున్నాయి. ఈలోగానే అదే లొకేష‌న్ నుంచి మ‌రో అరుదైన ఫోటో బ‌య‌ట‌కు వ‌చ్చింది. నిండైన మెగా ఫ్రేమ్ జోరుగా వైర‌ల్ అవుతోంది.

ఇదిగో ఆర్‌ సి12 సెట్‌ లోని బెస్ట్ ఫోటో ఇదే. మెగాస్టార్ చిరంజీవి - రామ్‌ చ‌ర‌ణ్‌ - సుశ్మిత & టీమ్ ఈ ఫోటోలో ద‌ర్శ‌న‌మిచ్చారు. చిరు - చ‌ర‌ణ్ సినిమాల‌కు సుశ్మిత‌నే కాస్ట్యూమ్ డిజైన‌ర్‌. ఆర్‌ సి12 - సైరా చిత్రాల‌కు కాస్ట్యూమ్ డిజైన‌ర్‌ గా ప‌ని చేస్తున్నారు. అందుకే ఆ ఇద్ద‌రూ ఎక్క‌డ ఉంటే అక్క‌డ సుశ్మిత కూడా స‌పోర్టుగా ఉంటున్నారు. ఆ అరుదైన మూవ్‌ మెంట్‌ ని చిరు ఎంత‌గా ఎంజాయ్ చేస్తున్నారో. పిల్ల‌ల‌తో ప‌సోడు అయిపోయారు. ప్ర‌స్తుతం ఈ ఫోటోని మెగాభిమానులు సామాజిక మాధ్య‌మాల్లో వేగంగా వైర‌ల్ చేస్తున్నారు. త‌దుప‌రి జార్జియాలో పాతిక రోజుల పాటు సైరా- వార్ ఎపిసోడ్స్ షూటింగ్‌ లో మెగాస్టార్ పాల్గొంటారు. చ‌ర‌ణ్ టీమ్ ఇంచుమించు అన్ని రోజులు అజ‌ర్‌ భైజాన్‌ లో స్పెండ్ చేయ‌నున్నారు.