Begin typing your search above and press return to search.

కాస్ట్ కటింగ్ అంటే చిరు దగ్గరే...

By:  Tupaki Desk   |   29 July 2016 12:30 AM GMT
కాస్ట్ కటింగ్ అంటే చిరు దగ్గరే...
X
సినిమాలో కంటెంట్ ఉన్నప్పుడు పాపులర్ యాక్టర్లు లేకపోయినా చాలు.. ఆటోమ్యాటిక్ గా ఆడేస్తుంది అని చాలామంది పాత తలకాయలు నమ్ముతుంటారు. అలాంటివారిలో మెగాస్టార్ చిరంజీవి కూడా ఒకరు. పాత్ర డిమాండ్ చేస్తే శ్రీదేవి.. లేదంటే కరిష్మా కొటాక్‌ అయినా చాలు అని ఎప్పటికప్పుడు కాస్టును ఎలా తగ్గించాలో ఆయనకు బాగా తెలుసు.

నిజానికి మెగాస్టార్ 150వ సినిమాలో విలన్ గా చాలామంది పేర్లు విన్నాం. అయితే కోటి రూపాయలకు పైగా డిమాండ్ చేసే జగపతి బాబు.. వివేక్ ఒబెరాయ్.. అరవింద్ స్వామి.. తదితర విలన్లను పక్కనెట్టేసి.. అప్పుడెప్పుడో జబ్ వుయ్ మెట్ సినిమాలో కరీనా కపూర్ ను వదిలించుకునే లవ్వర్ గా చేసిన తరుణ్‌ అరోరాను (నిజ జీవితంలో హీరోయిన్ అంజలా జెవేరి భర్త) సెలక్టు చేయడం అంటే చూస్కోండి మరి.. ఎంత కాస్ట్ కాన్షియస్ గా ఈ డెసిషన్‌ తీసుకున్నారో. తరుణ్‌ అరోరాకు 10 లక్షలు ఇచ్చుంటారేమో అనేది టాక్‌. ఇక హీరోయిన్ విషయంలో కూడా.. 2.5 కోట్లు ఇచ్చి కత్రినా కైఫ్‌ వంటి అమ్మాయిని తీసుకోవచ్చు. కాకపోతే అంత ఖర్చెందుకు అనేది చిరంజీవి అభిప్రాయమట. 'కత్తి' సినిమా కంటెంట్ కు ఎలాగో హీరోయిన్ కు సంబంధం లేదు. కేవలం పాటల్లో మెరవడానికి ఆ సినిమాలో సమంత రోల్ ను క్రియేట్ చేశారు. అలాంటప్పుడు అంత పెద్ద హీరోయిన్ ఎందుకు.. అవుటాఫ్‌ ఫాం లో ఉన్న త్రిష వంటి భామలను సెట్ చేస్తే సరిపోతుంది అనేది మెగాస్టార్ ఫీలింగ్ కాబోలు.

ఆ లెక్కన చూస్తే.. రెమ్యూనరేషన్లను పక్కనెట్టేసి సినిమా మొత్తం ఒక 20 కోట్లలో చుట్టేస్తారేమో. అదే బెటర్ కదూ. భారీ బడ్జెట్లో తీసి భారీ రేట్లకు అమ్మేసి ప్రీ-రిలీజ్ హైప్ సృష్టించి.. డిస్ర్టిబ్యూటర్లను బాధపెట్టేబదులు.. తక్కువ ఖర్చుతో ఎక్కువ డబ్బులు వస్తేనే సంతోషం.