Begin typing your search above and press return to search.

దీపావళికి ముందే ఖైదీ పండగ స్టార్ట్

By:  Tupaki Desk   |   27 Oct 2016 3:50 PM GMT
దీపావళికి ముందే ఖైదీ పండగ స్టార్ట్
X
టాలీవుడ్ లో లేటెస్ట్ సెన్సేషన్ ఏదయ్యా అంటే.. మెగాస్టార్ చిరంజీవి కంబ్యాక్ మూవీ ఖైదీ నెంబర్ 150 అనే చెప్పాలి. సినిమా షూటింగ్ మొదలయ్యే వరకు ఎక్స్ పెక్టేషన్స్ ఓ రకంగా ఉంటే.. సడెన్ గా అంచనాలు ఆకాశాన్ని అంటేశాయి. టాలీవుడ్ లో ఇప్పటివరకూ రిలీజ్ అయిన ఏ సినిమాకి జరగని రేంజ్ లో బిజినెస్ లు జరిగిపోతున్నాయి. రాబోయే వాటిలో చూసినా.. బాహుబలి2 తప్ప వేరే ఈ చిత్రం ఖైదీ నెంబర్ 150కి దరిదాపుల్లో కూడా లేదు.

ఈ మూవీకి అంతకంతకూ హైప్ పెరిగిపోతుండడానికి కారణం.. మెగాస్టార్ చిరంజీవి రీఎంట్రీనే. అయితే.. ఇప్పుడీ మూవీలో మెగాస్టార్ లుక్ ఎలా ఉండనుందో రివీల్ చేసేయనున్నారు. ఇందుకు అక్టోబర్ 29ని ముహూర్తంగా ఫిక్స్ చేశారు. ఆ తర్వాత రోజు దీపావళి పండగ వస్తుంటే.. మెగా ఫ్యాన్స్ కి ముందురోజే హంగామా చేసేసుకునే ఛాన్స్ వస్తోంది. 'మెగా స్టైల్ తో దీవాళి సెలబ్రేట్ చేసుకుందాం. అక్టోబర్ 29 మధ్యాహ్నం 2 గంటలకు ఖైదీ నెంబర్ 150 పోస్టర్ రిలీజ్' అంటూ సినిమా యూనిట్ అఫీషియల్ గా అనౌన్స్ చేసేసింది.

మెగాస్టార్ ఫస్ట్ లుక్ ని చూచాయగా ఇప్పటికే ఇచ్చినా.. ఇప్పుడు పూర్తిస్థాయిలో ఖైదీ రూపాన్ని చూపించబోతున్నారన్న మాట. పబ్లిసిటీ స్ట్రాటజీ విషయంలో ఖైదీ నెంబర్ 150 యూనిట్ అవలంబిస్తున్న రూట్ చూస్తే.. టాలీవుడ్ కి కొత్త బెంచ్ మార్క్ సెట్ చేసేట్లుగానే ఉన్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/