Begin typing your search above and press return to search.

చిరు ఇంట్లో అసలేం జరుగుతోంది?

By:  Tupaki Desk   |   12 Feb 2016 5:30 AM GMT
చిరు ఇంట్లో అసలేం జరుగుతోంది?
X
మెగాస్టార్ చిరంజీవి ఇల్లు ఇప్పుడు బాగా సందడిగా ఉంది. చుట్టాలు, పక్కాలు అంతా నానా హంగామా. ఇదుగో పైన ఫోటోలో కనిపిస్తున్నట్లుగా ఓ వేడుకకు సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇంతకీ ఈ ఫంక్షన్ ఏంటన్నదే అసలు ప్రశ్న. సహజంగా చిరంజీవి తన ఇంట్లో జరిగే వేడుకలకు సంబంధించి, అభిమానులతో న్యూస్ పంచుకుంటూనే ఉంటారు. తన అభిమాన సంఘాలకు డీటైల్స్ ఫార్వార్డ్ చేస్తూ ఉంటారు.

కానీ ఇప్పుడు చిరు ఇంట జరుగుతోంది పర్సనల్ పండుగ. అదేంటన్నది చిరు చెప్పకపోయినా.. ఇప్పటికే చాలా మంది ఊహించేశారు. చిరు చిన్న కూతురు శ్రీజకి శిరీష్ భరద్వాజ్ తో విడాకులు అయిపోవడంతో.. ఇప్పుడు మళ్లీ పెళ్లి ఫిక్స్ అయిందనే వార్తలు గుప్పుమంటున్నాయి. చిత్తూరు జిల్లాకు చెందిన ఓ ఎన్నారై వ్యాపారవేత్త.. మెగాస్టార్ కి కాబోయే అల్లుడని తెలుస్తోంది. కొన్ని రోజుల క్రితం ఈ పెళ్లికి సంబంధించిన ఏర్పాట్లు మొదలయ్యాయని అంటున్నారు. కేరళలో షూటింగ్ లో ఉన్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా.. అన్నయ్య కూతురి పెళ్లి వేడుకల ప్రారంభం కోసమే హైద్రాబాద్ వచ్చారని తెలుస్తోంది.

వచ్చే నెలలో శ్రీజ పెళ్లి జరగనుందట. ఈ వేడుకలను, చిరు ఫేస్ లో ఆనందాన్ని చూస్తుంటే.. కూతురు పెళ్లి అనే అనుకోవచ్చు. అయితే.. నిజంగా చిన్న కూతురు పెళ్లేనా.. లేక మరేదైనా ఫంక్షన్ కోసమా అనే విషయం మాత్రం అధికారికంగా ఎవరూ చెప్పలేదు. కానీ.. శ్రీజ పెళ్లి అనే చాలామంది అంటున్నారు. అది కూడా చాలా వైభవంగానే చేయబోతున్నారట.