Begin typing your search above and press return to search.

తండ్రీకొడుకులు - తమిళ సినిమాలలు

By:  Tupaki Desk   |   7 Oct 2015 1:30 AM GMT
తండ్రీకొడుకులు - తమిళ సినిమాలలు
X
ఇండస్ట్రీలో మెగా ఫ్యామిలీకి ఒక స్టేటస్ వుంది. వారి స్టోరీ సెలెక్షన్ లో గానీ, వాటిని చిత్రీకరించే తీరులో గానీ తమ మార్కు ఎంటర్టైన్మెంట్ గ్యారంటీ గా వుంటుంది. ప్రస్తుతం బ్రూస్ లీ సినిమాతో మెగా హీరోలు చిరంజీవి, చరణ్ ఒకేసారి తెరపై కనువిందు చేయనున్నారు.

అక్టోబర్ లో ఈ సినిమా భారీ విడుదలకు సిద్ధపడుతుంది. సాధారణంగానే 40 కోట్ల క్లబ్బులోకి తేలికగా ప్రవేశించే చరణ్ చిరు రాకతో ఇప్పుడు 100 కోట్లకు గురిపెట్టాడు. ఇక ఈ సినిమా తరువాత తండ్రీ కొడుకులు నవంబర్ లో వేర్వేరుగా తమ తదుపరి సినిమాలపై దృష్టిపెట్టనున్నారు.

అయితే విశేషమేమిటంటే వీరిద్దరి తదుపరి సినిమా తమిళ నాట ఘన విజయం సాధించిన సినిమాలు రీమేక్ కావడం. ఒకేసారి తండ్రి కొడుకులు తమిళ సినిమాలను తెలుగులో తీసుకురావడం ఇప్పటివరకూ జరిగింది లేదు. మెగాస్టార్ - వినాయక్ ల కాంబినేషన్ లో కత్తి రీమేక్ అవుతుంటే, చరణ్ - సురేందర్ లు తని ఒరవన్ ని ఇక్కడకు తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. మరి మన తెలుగు మెగా హీరోలకు తమిళ సినిమాలు ఎంతటి విజయాన్ని అందిస్తాయో చూడాలి..