ప్రభాస్-నిహారిక కలిసి..! ఏం జరగబోతోంది.?

Thu Jul 19 2018 12:37:04 GMT+0530 (IST)

వైరల్ న్యూస్.. ఇప్పుడు మీడియాకు కావాల్సింది ఇదే.. దీనికోసం ఎవరినైనా సరే బతికుండగానే చంపేస్తారు.. హీరో హీరోయిన్ల మధ్య సంబంధాలు అంటగట్టేస్తారు.. కనీసం వారి అభిప్రాయాలను కూడా తీసుకోకుండా వార్తలు వండి వారుస్తున్నారు. యూట్యూబ్ చానెళ్ల పరిస్థితి అయితే చెప్పక్కర్లేదు.. సెలెబ్రెటీల సంగతులు బేస్ చేసుకొని కథనాలు అల్లేసి వారి వ్యక్తిగత జీవితాల్లోకి కూడా తొంగిచూస్తున్నారు.చాలా రోజులుగా మెగా డాటర్ నిహారిక-యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ లు పెళ్లి చేసుకోబోతున్నారనే వార్త సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి తెలిసిందే.. దీనిపై అటు మెగా ఫ్యామిలీ.. ఇటు ప్రభాస్ ఫ్యామిలీ కూడా క్లారిటీ ఇచ్చింది. అది తప్పుడు వార్త అని స్పష్టం చేశారు. అయితే ఏదో గుసగుస వినపడితే చాలు కథనాలు అల్లేస్తున్నారు..

సోషల్ మీడియాలో వైరల్ అయిన నిహారిక-ప్రభాస్ లు ఇప్పుడు ఒకవేదిక పంచుకోబోతున్నారనే వార్త ఫిలింనగర్ లో హాట్ టాపిక్ గా మారింది. ప్రభాస్ సన్నిహితుల నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ పతాకంపై ‘హ్యాపీ వెడ్డింగ్’ అనే సినిమా రూపొందింది. ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకను ఈనెల 21న హైదరాబాద్ లో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీ టీజర్ కు మంచి స్పందన వచ్చింది. పెళ్లి చుట్టూ తిరిగే కథను అద్భుతంగా తీశారు. సుమంత్ అశ్విన్ హీరోగా నిహారిక హీరోయిన్ గా నటిస్తోంది. ప్రభాస్ సొంత నిర్మాణ సంస్థగా చెప్పుకునే యూవీ క్రియేషన్స్ ఈ సినిమాను నిర్మించడంతో ఇప్పుడు ఈ ప్రీ రిలీజ్ వేడుకకు బాహుబలి రావడానికి సుముఖంగా ఉన్నాడనే ప్రచారం జరుగుతోంది.

ఇక మెగా హీరోల వేడుకలన్నింటికి హాజరయ్యే చిరంజీవి కూడా కూతురు నిహారిక ఫంక్షన్ కు చీఫ్ గెస్గ్ గా వస్తాడని తెలుస్తోంది. ఈ ఈవెంట్ ను సక్సెస్ చేసేందుకు యూవీ క్రియేషన్స్ వారు ఇప్పటికే చిరు - ప్రభాస్ ను ఆహ్వానించారని.. వారిద్దరూ వస్తే సినిమాకు మంచి ప్రచారం లభిస్తుందని యోచిస్తున్నారు. ఈ వార్త కనుక నిజమైతే మాత్రం అభిమానులకు పండుగే..

  అన్నీ అనుకున్నట్టు అయితే ప్రభాస్-నిహారిక స్టేజ్ ను పంచుకుంటే ఏం జరుగుతుంది..? వారి తమ మధ్య వచ్చిన గాసిప్పులకు ఎలా సమాధానమిస్తారన్నది ఆసక్తిగా మారింది. చూద్దాం మరి.. ఏం జరుగుతుందో..