Begin typing your search above and press return to search.

చిరంజీవి-పవన్ సినిమా ఉంది. ఉందంతే.

By:  Tupaki Desk   |   23 Feb 2017 10:57 AM GMT
చిరంజీవి-పవన్ సినిమా ఉంది. ఉందంతే.
X
ఎట్లాగైనా సరే.. మెగాస్టార్ చిరంజీవితో అలాగే ఆయన తమ్ముడు పవన్ కళ్యాణ్‌ తో కలిపి ఒక మల్టీ స్టారర్ సినిమాను రూపొందిస్తాను అంటూ శపథం చేస్తున్నారు ఎంపి మరియు బిజినెస్ మ్యాన్ టి.సుబ్బిరామి రెడ్డి. అసలు ఈ సినిమా గురించే తనకు ఏ మాత్రం తెలియదు పవన్ కళ్యాణ్‌ మొన్న హార్వార్డ్ యునివిర్సిటి టూర్ సందర్భంగా అక్కడ స్టూడెంట్లతో చెప్పిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు సుబ్బిరామి రెడ్డి మాత్రం అసలు విషయం ఏంటో వివరణ ఇచ్చారు.

''ఒక అద్భుతమైన మల్టీస్టారర్ తీయాలని నేను ఫిక్సయ్యా. అందుకే చిరంజీవి కుటుంబ సభ్యులు అందరూ కూర్చున్నప్పుడు అదే విషయం ప్రస్తావించాను. పవన్ కళ్యాణ్‌ ను స్వయంగా కలసి ఈ ఐడియాను చెప్పాను. అన్నయ్య నేనూ కలసి సినిమా చేస్తే దాని రేంజ్ ఆకాశాన్ని తాకుతుంది.. మీరు కథ తీసుకురండి చేసేద్దాం అన్నాడు. అలాగే చిరంజీవి కూడా తమ్ముడితో సినిమా అనగానే ఎక్సయిట్ అయ్యాడు. ఇక కథను వండించే పని త్రివిక్రమ్ కు అప్పజెప్పా. అతను కథ రెడీ చేయగానే ఇటు చిరంజీవి అటు పవన్ ల డేట్లను చూసుకుని.. నేను మరియు అశ్వినీదత్ ఈ సినిమాను రూపొందిస్తాం. ఇది కన్ఫామ్'' అంటూ చెప్పుకొచ్చారు టి.ఎస్.ఆర్.

ఈ సినిమా ఉందంటే ఉంది అంటూ సుబ్బిరామి రెడ్డి ఇంత గాట్టిగా చెబుతుంటే.. అటు పవన్ మాత్రం నాకు అలాంటి సినిమా గురించి ఏమీ తెలియదు అనడం కాస్త ఆశ్చర్యకరమే. అసలు పవన్ నిజం చెప్పాడా? లేకపోతే టిఎస్సార్ నిజం చెబుతున్నారా? ఇప్పుడు ఇదే అందరి మదిలోనూ మెదులుతున్న ప్రశ్న!!



Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/