Begin typing your search above and press return to search.

చిరు-బన్నీ కాంబో ఒక సిల్లీ గాసిప్పేనా?

By:  Tupaki Desk   |   23 Nov 2018 9:09 AM GMT
చిరు-బన్నీ కాంబో ఒక సిల్లీ గాసిప్పేనా?
X
కొన్ని కాంబినేషన్లు ఆలోచిస్తేనే ఆడియన్సుకు కిక్కొస్తుంది. అలాంటి కాంబినేషన్లలో చిరంజీవి-పవన్ కళ్యాణ్ కాంబినేషన్ ఒకటి. ఆ సినిమాపై భారీగా చర్చ జరిగింది. ఏకంగా టీ. సుబ్బరామి రెడ్డిగారే చిరు-పవన్ కాంబో తెరకెక్కించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని ప్రకటించినా.. అది పట్టాలెక్కడం అసాధ్యమేనని చాలామంది అనుకున్నారు. దానికి తగ్గట్టే ఇప్పటివరకూ ఆ సినిమాకు సంబంధించిన అడుగులు ముందుకు పడలేదు.

ఇక తాజాగా అలాంటిదే మరో కాంబో గురించి వార్తలు వినిస్తున్నాయి. ఈసారి మెగాస్టార్ చిరంజీవి - స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ల కాంబినేషన్ లో సినిమాను దిల్ రాజు ప్లాన్ చేస్తున్నాడని అంటున్నారు. చిరు - బన్నీ లకు చక్కగా సూట్ అయ్యే ఒక మంచి కథను దర్శకుడు వంశీ పైడిపల్లి తయారు చేశాడట. ఇంకా ఈ కథను ఇద్దరూ స్టార్లలకు వినిపించలేదని అంటున్నారు. ఈ ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్ళే దిశగా ప్రయత్నాలు మాత్రం సాగుతున్నాయట.

ప్రస్తుతం చిరంజీవి 'సైరా' చిత్రంతో బిజీగా ఉన్నారు. దాంతో పాటుగా కొరటాల శివ చిత్రం కూడా లైన్ లో ఉంది. బన్నీ మెగాస్టార్ డివోటీ కాబట్టి కాంబినేషన్ పరంగా అయితే చిరు వైపునుండి ఓబ్జేక్షన్ ఉండదు కానీ ప్రస్తుతం కమిట్ అయిన రెండు ప్రాజెక్టుల తర్వాతే ఈ సినిమాకు అవకాశం ఉంటుంది. మరోవైపు బన్నీ త్రివిక్రమ్ దర్శకత్వంలో సినిమాకు రెడీ అవుతున్నాడని ఇప్పటికే టాక్ వుంది. ఇక మరో తమిళ రీమేక్ ను కూడా టేకప్ చేసే ఆలోచనలో ఉన్నాడని అంటున్నారు. ఇవన్నీ గమనిస్తున్న కొంతమంది మాత్రం చిరు- బన్నీ కాంబో న్యూస్ ఒక సిల్లీ గాసిప్ అని కొట్టి పారేస్తున్నారు.