Begin typing your search above and press return to search.

సుప్రీమ్ ప్రివ్యూ సెంటిమెంట్ ఫాలో అయ్యాడే

By:  Tupaki Desk   |   5 May 2016 4:49 AM GMT
సుప్రీమ్  ప్రివ్యూ సెంటిమెంట్ ఫాలో అయ్యాడే
X
సాయిధరం తేజ్ నటించిన సుప్రీమ్ చిత్రం ఇవాళే రిలీజ్ అవుతోంది. ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున ఈ మూవీని రిలీజ్ చేస్తున్నాడు నిర్మాత దిల్ రాజు. ఇప్పటివరకూ తేజు సినిమాల్లో ఇదే బిగ్గెస్ట్ రిలీజ్ గా నిలవనుంది. సాయిధరం తేజ్ - రాశి ఖన్నా జంటగా నటించిన ఈ చిత్రానికి.. అనిల్ రావిపూడి దర్శకత్వం వహించాడు.

సుప్రీమ్ విడుదలకు ముందురోజున మెగాస్టార్ చిరంజీవి కోసం స్పెషల్ షో వేసి చూపిచింది యూనిట్. హైద్రాబాద్ లోని ప్రసాద్ ల్యాబ్స్ లో ఈ ప్రీమియర్ ను ప్రదర్శించగా.. సుప్రీమ్ ను ఆద్యంతం తిలకించిన మెగాస్టార్.. యూనిట్ ని ప్రశంసలో ముంచెత్తారు. ఈ ప్రీమియర్ కు హీరో హీరోయిన్లతో పాటు నిర్మాత దిల్ రాజు - ఇతర క్రూ మెంబర్లు కూడా హాజరయ్యారు. మూవీ ఔట్ పుట్ చాలా బాగుందని పొగిడారట చిరంజీవి.

ఈ మధ్యన మెగా ఫ్యామిలీ మూవీస్ అన్నింటినీ ఇలా రిలీజ్ కి ముందే చిరంజీవికి స్పెషల్ ప్రివ్యూ వేసి చూపిస్తున్నారు. ఇంకా చెప్పాలంటే ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ ముందుగానే చిరంజీవికి చూపించడం, ఆయన ఆశీర్వాదం పొందడం ఓ సెంటిమెంట్ అయిపోయింది. దాన్ని ప్రతీ ఫ్యామిలీ మెంబర్ ఫాలో అయిపోతుడడం విశేషం.