Begin typing your search above and press return to search.

మంచు హీరోకి మెగా సౌండింగ్!!

By:  Tupaki Desk   |   20 Feb 2017 1:01 PM GMT
మంచు హీరోకి మెగా సౌండింగ్!!
X
మంచు మనోజ్ నటించిన లేటెస్ట్ మూవీ గుంటూరోడు చిత్రానికి ఇప్పటికే ఇండస్ట్రీలో మంచి బజ్ ఏర్పడింది. కంప్లీట్ గా మాస్ జోనర్ లో రాబోతోన్న ఈ చిత్రం టీజర్ ట్రైలర్ ఆకట్టుకోగా.. మాస్ ఎలిమెంట్స్ ఫుల్ గా జోడించడంతో ఆసక్తి కలిగించింది.

ఇప్పుడీ చిత్రానికి మెగా సపోర్ట్ మాత్రమే కాదు.. ఏకంగా మెగాస్టార్ మద్దతు లభించేసింది. మంచు హీరో నటించిన ఈ మూవీకి మెగాస్టార్ చిరంజీవి వాయిస్ ఓవర్ చెప్పారు. ఈ విషయాన్ని గుంటూరోడు యూనిట్ ధృవీకరించడమే కాదు.. చిరుకు కృతజ్ఞతలు చెబుతూ పోస్టర్స్ కూడా వేసేసింది. చిరు-మోహన్ బాబుల మధ్య విబేధాలు ఉన్నాయనే టాక్ ఎప్పుడూ వినిపిస్తూ ఉన్నా.. ఇప్పుడు మంచు హీరో సినిమాకి చిరంజీవి వాయిస్ చెప్పడం విశేషంగానే చెప్పాలి.

మరోవైపు చిరు వాయిస్ ఇచ్చిన రుద్రమదేవి.. ఘాజీ వంటి చిత్రాలు సక్సెస్ కావడంతో.. ఆయన స్వరం వినిపించడం.. ఇప్పుడు హిట్ సెంటిమెంట్ గా మారిపోయింది. ఇప్పటికే మాస్ లో మంచి బజ్ క్రియేట్ చేసిన ఈ చిత్రానికి.. ఇప్పుడు మెగాస్టార్ వాయిస్ కూడా తోడవడంతో.. మాస్ ఆడియన్స్ లో ఆసక్తి మరింతగా పెరిగిపోయింది. మార్చ్ 3న మంచు మనోజ్ గుంటూరోడు థియేటర్లలోకి వచ్చేయనున్నాడు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/