చరణ్ కి పవర్ స్టార్.. బన్నీకి మెగాస్టార్

Mon Apr 16 2018 11:09:02 GMT+0530 (IST)

ఎప్పుడూ సినిమాలే చూడని పవన్ కళ్యాణ్.. రంగస్థలం కోసం కదిలాడు. సినిమాను థియేటర్ లో ఆసాంతం చూసి ఎంజాయ్ చేశాడు. రంగస్థలం సక్సెస్ మీట్ లో ఒకింత ఎక్కువగానే మాట్లాడాడు. ఆస్కార్ కు పంపాల్సిన సినిమా అన్నాడు. రంగస్థలం సక్సెస్ పై చాలా గర్వంగా కూడా కనిపించాడు. వీడు నా తమ్ముడు అంటూ చరణ్ ను ఆప్యాయంగా హత్తుకుని ముద్దాడాడు.పైదంతా జరిగి కొన్ని రోజులు అయితే.. ఇప్పుడు అల్లు అర్జున్ కోసం మెగాస్టార్ చిరంజీవి కదిలొచ్చారు. మే 4న విడుదలకు షెడ్యూల్ చేసిన బన్నీ మూవీ నా పేరు సూర్య- నా ఇల్లు ఇండియా మూవీకి ఇప్పుడు సాంగ్ షూటింగ్ జరుగుతోంది. ఈ సందర్భంగా చిరంజీవి ఆ సినిమా సెట్స్ కు వెళ్లి యూనిట్ సభ్యులను పలకరించారు. బన్నీ వేసే స్టెప్పులను తిలకించి ఆనందించారు. తమ ఫ్యామిలీలో అంతా ఒకటే.. మెగా ఫ్యామిలీలో విబేధాలు ఏ మాత్రం లేవు ఈ కలయికలు.. మీటింగులు అన్యాపదేశంగా చెబుతున్నట్లుగా ఉంది.

మెగాస్టార్ ను బన్నీ ఎంతగా అభిమానిస్తాడో మాటల్లోనే తెలిసిపోతుంది. బాబాయ్ అంటే తనకు ఎంత ప్రాణమో మాటల్లో వర్ణించలేకపోతాడు చెర్రీ. చిన్నా చితకా వైరుధ్యాలు ఫ్యాన్స్ మధ్య అడపాదడపా కనిపిస్తున్నాయి. ఇలాంటి వాటిని అన్నిటినీ పటాపంచలు చేసేందుకు.. చక్కని టెక్నిక్స్ తో అలరిస్తుంటుంది మెగా ఫ్యామిలీ. ఒకరినొకరు సపోర్ట్ చేసుకోవడం.. అందరు హీరోలను ఎంకరేజ్ చేస్తుండడం చూస్తే.. మెగా ఫ్యామిలీలో ఈ ఈక్వేషన్లు భలే ఉంటాయ్ బాసూ అనిపించక మానదు.