చిరుకి ఆ వర్గం మద్దతు లభిస్తోందిగా!!

Thu May 18 2017 00:25:58 GMT+0530 (IST)

మెగాస్టార్ చిరంజీవికి గతంలో రాజకీయంగా ఆయన సామాజిక వర్గం నుంచి మద్దతు బోలెడంత మద్దతు లభించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు పొలిటికల్ గా ఈక్వేషన్స్ మారినా.. సినిమా పరంగా మాత్రం తిరుగులేదని ఖైదీ నంబర్ 150 నిరూపించేసింది. అయితే.. ఇప్పుడు మెగాస్టార్ కు రెడ్డి వర్గం నుంచి సపోర్ట్ వస్తుండడం ఆశ్చర్యం కలిగిస్తోంది.

ఇదంతా ఉయ్యాలవాడ నరసింహారెడ్డి మహత్యమే. తొలి స్వాతంత్ర్య సంగ్రామానికి పూర్వమే బ్రిటిషర్లకు ఎదురు నిలిచి పోరాడడమే కాకుండా.. వారి తలలను తెగ నరికిన పోరాటయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి. రెడ్డి సామాజిక వర్గానికి దేశవ్యాప్తంగా గుర్తింపు ఆపాదించడంలో ఈయన పాత్ర చాలా ఉంది. అలాంటి యోధుడి జీవితాన్ని సినిమాగా మలుస్తుండడం.. అందులో టాలీవుడ్ బాక్సాఫీస్ చక్రవర్తి అయిన చిరంజీవి నటిస్తుండడంతో.. రెడ్డి వర్గం నుంచి ఫుల్ సపోర్ట్ వచ్చేస్తోంది. రాజకీయాలను పక్కన పెట్టేసి ఉయ్యాలవాడకు మద్దతు పలికేస్తున్నారు.

ఇంకా సినిమా ప్రారంభం కాకుండానే ఉయ్యాలవాడ నరసింహారెడ్డిగా చిరంజీవి రేఖా చిత్రాన్ని సోషల్ మీడియాలో తెగ షేరింగ్ చేసేస్తున్నారు. వీరికి మెగా ఫ్యాన్స్ కూడా తోడైతే.. తెలుగు రాష్ట్రాల్లో రికార్డుల దుమ్ము ఉయ్యాలవాడ దులిపేయడం ఖాయం అంటున్నారు ట్రేడ్ జనాలు.