Begin typing your search above and press return to search.

సైరా టీజ‌ర్ .. టిక్ టిక్ టిక్..

By:  Tupaki Desk   |   19 Aug 2018 1:30 AM GMT
సైరా టీజ‌ర్ .. టిక్ టిక్ టిక్..
X
టిక్ టిక్ టిక్.. టిక్ టిక్ టిక్‌.. మెగాఫ్యాన్స్ గుండెల్లో ఆటో సౌండ్ ఇది! ఆ సౌండ్‌ లోంచి పుట్టుకొచ్చే రీసౌండ్ అంతే ఉర‌క‌లెత్తిస్తుంది. మెగాస్టార్ అన్న పేరు వింటేనే ఆ సౌండ్ పీక్స్‌ కి చేరిపోతుంది. చాలా గ్యాప్ త‌ర్వాత మెగాస్టార్ 150వ సినిమా `ఖైదీనంబ‌ర్ 150` రిలీజ్ వేళ‌ అది ప్రూవైంది. ఇప్పుడు అంత‌కుమించి..

మెగాస్టార్ క‌థానాయ‌కుడిగా తెర‌కెక్కుతున్న 151వ సినిమా `సైరా-న‌ర‌సింహారెడ్డి` చిత్రీక‌ర‌ణ‌లో వేగం పెంచింది టీమ్‌. 2019 సంక్రాంతికి రిలీజ్ చేయాలంటే ఆ మేర‌కు డెడ్‌ లైన్ వేగంగానే స‌మీపిస్తున్న‌ట్టు లెక్క‌. అందుకు త‌గ్గ‌ట్టే సురేంద‌ర్ రెడ్డి ఈ భారీ చిత్రాన్ని వేగంగా అంత‌కుమించి నాణ్యంగా పూర్తి చేయాల‌ని త‌పిస్తున్నాడ‌ట‌. మెగాప‌వ‌ర్‌ స్టార్ రామ్‌ చ‌ర‌ణ్ ఏమ‌త్రం రాజీకి రాకుండా హై ఎండ్ బ‌డ్జెట్‌ తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇండియాస్ బెస్ట్ కాస్టింగ్‌ - వ‌ర‌ల్డ్ టాప్ టెక్నీషియ‌ల‌న్ల‌ను బ‌రిలో దించి చిత్రీక‌ర‌ణ సాగిస్తున్నారు. అదంతా అటుంచితే షూటింగ్ మొద‌లెట్ట‌క ముందే సైరా లోగో రిలీజ్ చేసి వేడి పెంచిన టీమ్ ఇన్నాళ్టికి టీజ‌ర్‌ తో రాబోతోంది. మ‌రో మూడు రోజుల్లో పూర్తి స్థాయి టీజ‌ర్‌ ని రిలీజ్ చేసేందుకు రెడీ అవుతోంది.

మెగాస్టార్ చిరంజీవి పుట్టిన‌రోజు కానుక‌గా ఆగ‌స్టు 21న ఈ టీజ‌ర్‌ ని లాంచ్ చేయ‌నున్నారు. ఆగ‌స్టు 22న బాస్ పుట్టిన‌రోజు వేడుక‌ల్లో మెగాఫ్యాన్స్ ఫుల్ బిజీ కాబోతున్నారు. అంత‌కుముందే ఈ టీజ‌ర్ హీట్ పెంచ‌నుంది. సైరా ఘ‌న‌విజ‌యం సాధించాల‌ని మెగా ఫ్యాన్స్ ఇప్ప‌టికే గుడులు-గోపురాల్లో పూజ‌లు - పున‌స్కారాలు చేస్తున్నార‌ని తెలుస్తోంది. మొత్తానికి మెగాస్టార్ `సైరా- టీజ‌ర్‌`కి సంబంధించిన అప్‌ డేట్ అంత‌కంత‌కు హీట్ పెంచుతోంది. అస‌లు ఈ టీజ‌ర్‌ లో సూరి అండ్ టీమ్ ఏ కంటెంట్ చూపించ‌బోతున్నారో? అన్న ఆస‌క్తి క్ష‌ణ‌క్ష‌ణం రెయిజ్ అవుతోంది. బ‌ర్త్ డే కానుక‌గా వ‌స్తోంది కాబ‌ట్టి, ఇందులో మ‌రీ అంత హ‌డావుడి లేకుండా సైరా-న‌ర‌సింహారెడ్డి రోల్‌ కి ఇంట్రోలా ఉంటుంద‌ని ఫ్యాన్స్‌ గెస్ చేస్తున్నారు. మొత్తానికి సైరా జ‌ర్నీ మొద‌లైంది.. అని ఇదివ‌ర‌కూ ప్ర‌క‌టించారు కాబ‌ట్టి ఆ మేర‌కు ఈ జ‌ర్నీ ఎలా వేడెక్కించ‌బోతోందో అన్న ఉత్కంఠ మొద‌లైంది.