Begin typing your search above and press return to search.

సైరా నెక్స్ట్ స్టెప్ పడుతోంది

By:  Tupaki Desk   |   26 May 2018 11:30 PM GMT
సైరా నెక్స్ట్ స్టెప్ పడుతోంది
X
టాలీవుడ్ లో బాహుబలి తరువాత ఆ స్థాయిలో మళ్లీ మన ముందుకు రాబోతున్న చిత్రం మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న సైరా. మొదటి స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాల వాడ నర్సింహా రెడ్డి జీవిత ఆధారంగా ఆ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. కమర్షియల్ దర్శకుడు సురేందర్ రెడ్డి సినిమాను సరికొత్తగా ప్రజెంట్ చేయడానికి కష్టపడుతున్నాడు. ఇప్పటికే ఓ షెడ్యూల్ ని ఫినిష్ చేసుకున్న ఈ చిత్రం మరో షెడ్యూల్ ని మరికొన్ని రోజుల్లో స్టార్ట్ చేయనుంది.

వచ్చే నెల జూన్ మొదట్లోనే సినిమాకు సంబందించిన కొన్ని భారీ పోరాట దృశ్యాలను చిత్రీకరించడానికి దర్శకుడు ప్లాన్ చేసుకున్నాడు. వాటితో పాటు కీలకమైన సన్నివేశాలను కూడా ఫినిష్ చేయనున్నారు. అత్యంత కీలకమైన షెడ్యూల్ ఇదేనట. యాక్షన్ సీన్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయని చిత్ర యూనిట్ ద్వారా తెలిసింది. జూన్ 5 నుంచి ఈ షెడ్యూల్ స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది. ఇక చిరంజీవితో పాటు మరికొంత మంది స్టార్ నటీనటులు కూడా ఈ షెడ్యూల్ లో పాల్గొనబోతున్నారు.

దాదాపు 200 కోట్ల భారీ బడ్జెట్ తో రామ్ చరణ్ తన సొంత హోమ్ ప్రొడక్షన్ లో సినిమాను నిర్మిస్తున్నాడు. దర్శకుడు సురేందర్ రెడ్డి విజువల్ ఎఫెక్ట్స్ కి సంబందించిన పనులను కూడా ఎప్పటికప్పుడు ఫినిష్ చేసేలా ప్లాన్ చేసుకున్నాడు. ఇక ఈ సినిమాలో ప్రముఖ అగ్ర తారలు అమితాబ్ బచ్చన్ - విజయ్ సేతుపతి - నయనతార సుదీప్ తమన్నా తో పాటు జగపతి బాబు కూడా ప్రత్యేక పాత్రల్లో కనిపించనున్నారు.