సైరా అప్పుడైనా స్టార్ట్ అయ్యేనా?

Tue Oct 24 2017 12:47:59 GMT+0530 (IST)

టాలీవుడ్ లో బాహుబలి తర్వాత ఆ స్థాయిలో తెరకెక్కుతోన్న మారో చిత్రం సైరా నరసింహా రెడ్డి. మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే అత్యంత భారీ బాడ్జెట్ తో ఈ సినిమాను రామ్ చరణ్ నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే పాత్రలను అలాగే సాంకేతిక నిపుణులను సెట్ చేసుకున్న చిత్ర యూనిట్ ఇంకా సినిమాను స్టార్ట్ చేయడంలో తడబడుతోంది అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.దర్శకుడు సురేందర్ రెడ్డి ఎందుకు ఇంత ఆలస్యం చేస్తున్నారు అనే విషయం ఎవ్వరికి అర్ధం కావడం లేదు. సినిమా టైటిల్ ను ఫిక్స్ చేసి నెలలు కావొస్తోంది. కొన్ని నెలల క్రితమే స్టార్ట్ చేస్తామని చెప్పిన నిర్మాత రామ్ చరణ్ ఇంకా సినిమాను పట్టాలెక్కించలేదు. దర్శకుడు సురేందర్ రెడ్డి కూడా విదేశాలకు వెళ్లి గ్రాఫిక్స్ నిపుణులను కలిసి వచ్చాడు. అతను రాగానే అక్టోబర్ 20న మొదలవుతుందని చిత్ర యూనిట్ చెప్పింది. అయితే ఇప్పుడు మళ్లీ మరొక డేట్ ని ఫిక్స్ చేసుకుందట సైరా చిత్ర బృందం.

అన్నీ ఒకేసారి సెట్ అయిన తర్వాత డిసెంబర్ మొదటి వారంలో సినిమాను మొదలు పెట్టి ఏ మాత్రం ఆపకూడదని అందరు అనుకున్నట్లు తెలుస్తోంది. రామ్ చరణ్ కూడా అప్పుడు కొంచెం ఖాళీగా ఉంటాడట. దీంతో చిత్రాన్ని ఒక్కసారి సెట్స్ పైకి తీసుకెళితే అంతా సెట్ అవుతుందని డిసెంబర్ లోనే స్టార్ట్ చెయ్యాలని ఫిక్స్ అయ్యారు. మరి ఆ డేట్ అప్పుడైనా స్టార్ట్ చేస్తారో లేదా చూడాలి. నయనతార హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రానికి రెహమాన్ సంగీతాన్ని అందిస్తున్నారు. అలాగే అమితాబ్ - జగపతి బాబు అండ్ సుదీప్ వంటి అగ్రనటులు సినిమాలో నటిస్తున్నారు.