Begin typing your search above and press return to search.

సైరా: యుద్ధానికి సైసై అంటున్న చిరు

By:  Tupaki Desk   |   15 Sep 2019 3:29 PM GMT
సైరా: యుద్ధానికి సైసై అంటున్న చిరు
X
మెగాస్టార్ చిరంజీవి నూతన చిత్రం 'సైరా' మరో పదిహేను రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే. బుధవారం నాడు ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగనుంది. ఇదే ఈవెంట్ లో 'సైరా' ట్రైలర్ ను రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. అంతలోపు 'సైరా' టీమ్ ఇంట్రెస్టింగ్ పోస్టర్లతో ఆడియన్సును ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు.

తాజాగా ఈ సినిమా నుండి మరో కొత్త పోస్టర్ వచ్చింది. ఈ పోస్టర్ లో యుద్ధరంగంలో చిరు పోరాటానికి సైసై అంటున్నారు. నలుపు రంగు దుస్తులు ధరించి వీపుకు తగిలించుకున్న ఖడ్గాలను తన రెండు చేతులతో తీస్తూ ఒక ఇంటెన్స్ లుక్ ఇచ్చారు. నేపథ్యంలో చిరు వెనుక కొంతమంది కత్తులను పైకెత్తి చిరుతో పాటు శత్రువులపై పోరాటానికి రెడీ అవుతున్నారు. సాధారణమైన సినిమాల్లో కూడా ఫైట్ సీక్వెన్సులకు చిరు పెట్టింది పేరు. ఇక ఈ సినిమాలో యాక్షన్ ఎపిసోడ్లు ప్రేక్షకులను థ్రిల్ చేసేలా ఉంటాయని ఇప్పటికే ఇన్సైడ్ టాక్ వినిపిస్తోంది. ఈ పోస్టర్లో చిరును చూస్తుంటే అది నిజమేననిపిస్తోంది.

సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ భారీ బడ్జెట్ చిత్రం అక్టోబర్ 2 న ప్రేక్షకుల ముందుకు రానుంది. తొలి తెలుగు ఫ్రీడమ్ ఫైటర్ అయిన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమా తెలుగులో మాత్రమే కాకుండా పలు భారతీయ భాషలలో రిలీజ్ అవుతోంది. 'సాహో' తర్వాత ఇతర భాషల్లో భారీ స్థాయిలో రిలీజ్ అవుతున్న సినిమా ఇదే కావడంతో ఫలితం ఎలా ఉంటుందోనని అంతటా ఆసక్తి వ్యక్తం అవుతోంది.