చిరు లుంగీ మీద కామెంట్లు.. చెవిన పడ్డాయ్

Wed Jan 11 2017 10:10:41 GMT+0530 (IST)

మొత్తానికి సోషల్ మీడియాలో జరిగేవి ఏవైనా అసలు మెగాస్టార్ చిరంజీవి పట్టించుకుంటారా అనే ఓ సందేహం మొన్నటివరకు ఉండేది. బహుశా ఆయన ప్రత్యక్షంగా ట్విట్టర్ మరియు ఫేస్ బుక్ వంటి సామాజిక వెబ్ సైట్లలో లేరు కాబట్టి.. ఆయనకు ఇవన్నీ తెలియకపోవచ్చు.. ఆయన ఇవన్నీ చూడకపోవచ్చు అనుకున్నారు అందరూ. కాకపోతే చిరంజీవి రివీల్ చేసిన విషయాలను బట్టి చూస్తే.. అయితే ఆయన చుట్టూ ఉన్న వారో లేకపోతే ఆయనే స్వయంగా తెలుసుకుంటున్నారో తెలియదు కాని.. ఆయన మాత్రం సోషల్ మీడియాలో వచ్చే ప్రతి విషయం గురించి బాగా అప్డేడెట్ గా ఉన్నారు.

మొన్నామధ్యన ఖైదీ నెం 150లోని 'అమ్మడు లెట్స్ డు కుమ్ముడు' పాటను రిలీజ్ చేయడానికి ముందు.. ఒక పోస్టర్ రిలీజ్ చేశారు. అందులో చిరంజీవి జీన్స్ ప్యాంట్ పై లుంగీ కట్టుకుని ఉన్నారనే సంగతి తెలిసిందే. అయితే ఈ పోస్టర్ ను ట్వీట్ చేసిన రామ్ గోపాల్ వర్మ.. ఈ పోస్టర్ చూస్తే జేమ్స్ క్యామెరాన్ వంటి దర్శకులు కూడా నిర్ఘాంతపోతారు అంటూ ట్వీట్ చేయడం తనని ఆశ్చర్యానికి గురి చేసింది అన్నారు చిరు. అంతేకాదు.. అసలు వర్మ సైకాలజీ ఏంటనేది ఈ ట్వీట్లను చూస్తే ఏమాత్రం అర్దంకాదని.. అందరినీ ఎందుకలా టార్గెట్ చేస్తాడో ఏంటో అంటూ చిరంజీవి జాలి వ్యక్తపరిచారు.

ఈ యవ్వారంలో ఆడియన్స్ కు అర్దమైన మ్యాటర్ ఏంటంటే.. సోషల్ మీడియాలో వచ్చే విషయాలన్నీ చిరంజీవి చాలా క్లోజ్ గా వాచ్ చేస్తున్నారు అనుకోవచ్చు. లేదంటే ఆయన అనుచరులు అంతబాగా ప్రతీ విషయాన్నీ ఆయన చెవిన పడేస్తున్నారు అని కూడా అనుకోవచ్చు. ముఖ్యంగా మెగా బ్రదర్ నాగబాబు ఆయనకు అన్నీ చెప్తారట.. కొత్త సినిమాల నుండి క్వాంటమ్ ఫిజక్స్ వరకు అన్నీ మేం డిస్కస్ చేస్తాం అని చిరంజీవి చెప్పడంతో.. ఆయన ప్రిపరేషన్ ఎలా ఉందో అర్దమవుతోంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/