హేయ్.. మెగాస్టారేంటి ఇలా మారిపోయారు?

Sat Jan 13 2018 14:49:56 GMT+0530 (IST)

150 సినిమాల్లో నటించిన మెగాస్టార్ చీరంజీవి ఏనాడు కనిపించిన స్టైల్ లోనే మళ్లీ కనిపించలేదు ఆరు పదుల వయసొచ్చినా కూడా మెగాస్టార్ అందంలో కూడా ఏ మాత్రం మార్పు రాలేదు. ఏజ్ పెరుగుతున్న కొద్దీ మెగాస్టార్ నటనలో మార్పులు చేసినట్లే తన నడకలో లుక్ లో కొత్తగా కనిపించారే గాని నెగిటివ్ గా ఎప్పుడు కనిపించలేదు. బయట ప్రపంచంలో కూడా ఆయన సింపుల్ గా కనిపించినా అందరు పాజిటివ్ కామెంట్స్ చేశారు.కానీ ప్రస్తుతం మెగా స్టార్ చిరంజీవి లుక్ ని చూసి అందరు షాక్ అవుతున్నారు. బయటకు వచ్చినా కూడా గ్లామర్ ని మెయింటేన్ చేసే మెగాస్టార్ ఇప్పుడు వయసు ను చూపిస్తున్నారు. ఖైదీ నెంబర్ 150 సినిమా అయిపోగానే ఉయ్యాలవాడ నరసింహ రెడ్డి కథకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన మెగాస్టార్ మొదటి నుంచే వెరైటీ లుక్ తో కనిపించాడు. తన మీసాలతో చాలా కొత్తగా కనిపించాడు. గెడ్డం కూడా ఉయ్యాలా నరసింహ రెడ్డి పాత్రకు తగ్గట్టు రెడీ చేసుకున్నాడు.

కానీ రీసెంట్ గా క్లిన్ షేవ్ తో కనిపించేసరికి చిరంజీవిని ఎప్పుడు చూడని విధంగా అభిమానులు చూడడం మొదలుపెడుతున్నారు. రీసెంట్ గా జువ్వ సినిమా టీజర్ రిలీజ్ వేడుకలో గెడ్డం మీసం లేకుండా కనిపించడం మెగా అభిమానులకు రుచించడం లేదు. అయితే గ్రాఫిక్స్‌కు కావాల్సిన త్రీడీ ఇమేజెస్ కోసమే మెగాస్టార్ ఈ విధంగా రెడీ అయినట్లు సమాచారం. మరికొన్ని రోజుల్లో సైరా సెకండ్ షెడ్యూల్ ని దర్శకుడు సురేందర్ రెడ్డి పొల్లాచ్చిలో స్టార్ చేయనున్నాడు.