మెగా స్టార్ తో స్టార్ హీరోల మీటింగ్

Tue Apr 24 2018 23:42:37 GMT+0530 (IST)

ఈ మధ్య కాలంలో మన టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎన్నో మార్పులు వస్తున్నాయి. ముఖ్యంగా ఎప్పుడు లేనిది స్టార్ హీరోలు చాలా క్లోజ్ గా కనిపిస్తున్నారు. ఆడియెన్స్ కి ఎక్కువగా కనిపించకపోయినా వాళ్లు సీక్రెట్ గా కలుసుకుంటూనే ఉంటారు. ఇక అసలు మ్యాటర్ లోకి వస్తే.. రీసెంట్ గా మెగా స్టార్ చిరంజీవి  స్టార్ హీరోలతో మీటింగ్ జరిపినట్లు తెలుస్తోంది. అన్నపూర్ణ స్టూడియోలో లో ఆయన కారులో వెళుతుండడం కొందరి కంట పడింది.మీటింగ్ లో సూపర్ స్టార్ మహేష్ బాబుతో పాటు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా పాల్గొన్నారు. అలాగే వీరి తరువాత స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ - న్యాచురల్ స్టార్ నాని - అక్కినేని నాగ చైతన్య అక్కడికి వెళ్లారు. మంగళవారం రోజు వీరు కలుసుకోవడం జరిగింది. అయితే ఈ సమావేశంలో ఒక ముఖ్యమైన విషయం గురించి మెగా స్టార్ హీరోలతో చర్చలు జరిపినట్లు సమాచారం.

ప్రస్తుతం కొన్ని ప్రముఖ మీడియా ఛానెల్స్ సినిమా ఇండస్ట్రీ పై అసభ్యకరంగా డిబేట్స్ పెట్టడం అలాగే ఇష్టం వచ్చినట్లు వార్తలను ప్రసారం చేయడం జరుగుతున్నందు వల్ల ఇక సినిమాల యాడ్స్ వారికి ఏ మాత్రం ఇవ్వకూడదని నిర్ణయించినట్లు తెలుస్తోంది. మెగా స్టార్ చిరంజీవి తన నిర్ణయాన్ని తెలుపగా మహేష్ తో పాటు యువ హీరోలందరు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు టాక్. ప్రస్తుతం ఓ ఛానెల్ ప్రమోషన్స్ కోసం 20 లక్షలకు పైగా డిమాండ్ చేస్తోంది. కొన్ని ఛానెల్స్ మాత్రం రెండు వారాలు కేవలం 1 లక్ష మాత్రమే తీసుకుంటోంది. మరి ఈ పరిస్థితులలో హీరోలు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో చూడాలి.

వీడియో చూడటానికి క్లిక్ చేయండి