Begin typing your search above and press return to search.

చిరు అందరినీ శాటిస్ఫై చేస్తున్నారే!!

By:  Tupaki Desk   |   28 July 2016 1:30 AM GMT
చిరు అందరినీ శాటిస్ఫై చేస్తున్నారే!!
X
మెగాస్టార్ చిరంజీవి.. అనుకోవడానికి ఇదో పేరు కానీ.. టాలీవుడ్ లో ఇప్పుడిదో బ్రాండ్. మెగా అన్న ట్యాగ్ కోసం.. మెగాస్టార్ ఆశీస్సుల కోసం బోలెడంత మంది క్యూ కట్టేశారు. సినిమాల్లో రీఎంట్రీ అన్నప్పటి నుంచి చిరును చీఫ్ గెస్టుగా ఆహ్వానించడాలు ఎక్కువైనా.. ఏ ఒక్కటీ మిస్ చేయకుండా వచ్చేస్తున్నారు మెగాస్టార్.

ఎవరికీ నో అన్నమాట చెప్పకపోవడమే.. చిరంజీవి స్పెషాలిటీ. ముఖ్యంగా ఆయన కుటుంబం నుంచి వచ్చిన హీరోలంతా మెగా ఆశీస్సుల కోసం పాకులాడ్డం ఏ మాత్రం కాదనలేని విషయం. రామ్ చరణ్ తేజ్.. అల్లు అర్జున్.. సాయి ధరం తేజ్.. వరుణ్ తేజ్.. ఇలా చిరు కుటుంబం వచ్చిన హీరోలంతా మెగాస్టార్ ని తమ సినిమా ఫంక్షన్స్ కు ఆహ్వానించేస్తున్నారు. ఇండస్ట్రీ టాప్ హీరోల్లో ఒకడైన పవన్ కళ్యాణ్ కూడా సర్దార్ గబ్బర్ సింగ్ ఆడియో రిలీజ్ కి మెగాస్టార్ ని పిలిచాడు. అల్లు ఫ్యామిలీ హీరోలు కూడా మెగా ట్యాగ్ ని వదిలిపెట్టే పరిస్థితి లేదు. అయితే మెగా ఫ్యామిలీ నుంచి హీరోలు ఎక్కువైపోవడం చిరుకు కొంచెం ఇబ్బందిగా మారే ఛాన్స్ కనిపిస్తోంది.

ఈ నెల 30న సాయి ధరం తేజ్ తిక్క ఆడియో ఫంక్షన్ జరగనుండగా.. దానికి చీఫ్ గెస్ట్ చిరునే. ఆ మరుసటి రోజు అల్లు శిరీష్ నటించిన శ్రీరస్తు శుభమస్తు ప్రీ రిలీజ్ ఈవెంట్ కి కూడా మెగాస్టార్ హాజరు కానున్నారు. ప్రస్తుతం తన రీఎంట్రీ మూవీ కోసమే బోలెడంత కష్టపడుతున్న చిరంజీవి.. తన ఫ్యామిలీ హీరోలనే కాదు.. సునీల్ లాంటి తన ఫ్యాన్స్ ఎవరు పిలిచినా కాదనకుండా ఫంక్షన్లకు వస్తుండడం విశేషం.