Begin typing your search above and press return to search.

చిరు సెన్సేషనల్ స్టేట్మెంట్.. 6 ప్యాక్ కి రెడీ

By:  Tupaki Desk   |   20 Jan 2017 1:43 PM GMT
చిరు సెన్సేషనల్ స్టేట్మెంట్.. 6 ప్యాక్ కి రెడీ
X
మెగాస్టార్ చిరంజీవి కం బ్యాక్ మూవీ ఖైదీ నంబర్ 150.. భారీ బ్లాక్ బస్టర్ గా దూసుకుపోతోంది. ఇండస్ట్రీ రికార్డులన్నీ తుడిచిపెట్టేస్తూ పరుగులు పెడుతోంది. ఈ మూవీకి ప్రధాన ఆకర్షణ.. చిరంజీవి.. చిరంజీవి.. అండ్ చిరంజీవి అంతే. పదేళ్ల క్రితం కనిపించిన తీరు కంటే.. ఖైదీ నంబర్ 150 ఇంకో పదేళ్ల వయసు తగ్గినట్లుగా కనిపంచడం.. మెగాభిమానులను ఉర్రూతలు ఊగించేసింది. ఇంతగా తన లుక్ కనిపించడానికి అసలు కారణం ఏంటో చెప్పేశారు మెగాస్టార్.

'ఆన్ స్క్రీన్ పై నేను అలా కనిపించడానికి అసలు కారణం నా లైఫ్ స్టైల్. మనసులో పెద్దగా ఏమీ పెట్టుకోకుండా కూల్ గా లైఫ్ గడుపుతాను. అదే ఎఫెక్ట్ ఫేస్ లో కనిపిస్తుంది. రామ్ చరణ్ ఇచ్చిన సలహాలు.. చేయించిన వర్కవుట్స్ కారణంగా 9 కిలోల బరువు తగ్గాను. ఈతరం కుర్రాళ్లతో పోటీ పడ్డానికి అయినా రెడీనే. ఏ దర్శకుడు అయినా సరైన సబ్జెక్ట్ తో వచ్చి.. నన్ను సిక్స్ ప్యాక్ చేయమని అడిగానా సరే.. నేను సిద్ధమే. ఏ మాత్రం వెనుకాడను. కొన్నాళ్ల పాటు కష్టపడితే సిక్స్ ప్యాక్ చేయడం అసాధ్యమేమీ కాదు' అని చెప్పారు మెగాస్టార్.

వయసుకు తగ్గ పాత్రలు చేయడానికి కూడా రెడీనే అన్న చిరంజీవి.. కథ కరెక్ట్ గా కుదరాలే కానీ.. తాను ఏం చేయడానికైనా సిద్ధం అని చెప్పారు. ప్రేక్షకులు తనను రిసీవ్ చేసుకున్నంతవరకూ సినిమాలు కంటిన్యూ చేస్తానని చిరు చెప్పడం విశేషం.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/