Begin typing your search above and press return to search.

ఐశ్వర్యకు చిరంజీవి స్వీట్ షాక్

By:  Tupaki Desk   |   18 Jun 2019 10:46 AM GMT
ఐశ్వర్యకు చిరంజీవి స్వీట్ షాక్
X
చిన్న మరియు మీడియం బడ్జెట్ సినిమాలకు తన వంతు చేయూత ఎప్పుడు అందించే మెగాస్టార్ చిరంజీవి మరోసారి అలాంటి ప్రోత్సాహమే అందించబోతున్నారు. తమిళ్ లో గత ఏడాది విడుదలై అద్భుత విజయాన్ని సొంతం చేసుకున్న కణను తెలుగులో భీమినేని శ్రీనివాసరావు దర్శకత్వంలో ప్రముఖ నిర్మాత కేఎస్ రామరావు కౌసల్య కృష్ణముర్తి పేరుతో రీమేక్ చేశారు. ఒరిజినల్ వెర్షన్ లోని పాత్రను తెలుగులోనూ ఐశ్వర్య రాజేష్ చేస్తుండగా తండ్రిగా నటించిన సత్యరాజ్ బదులు ఇక్కడ రాజేంద్ర ప్రసాద్ కనిపించనున్నారు.

ఇప్పటికే దీని ఫస్ట్ లుక్ పోస్టర్స్ కు స్పందన బాగుంది. ఇవాళ సాయంత్రం 5 గంటలకు చిరంజీవి చేతుల మీదుగా టీజర్ ని రిలీజ్ చేయబోతున్నారు. అయితే ముందే దీన్ని చూసేసిన చిరు ఐశ్వర్య రాజేష్ కు స్వయంగా ఫోన్ చేశారు. టీజర్ లోనే చక్కని పెర్ఫార్మన్స్ కనిపించిందని సినిమాలో ఇంకెంత విషయం ఉంటుందో అన్న ఆనందాన్ని వ్యక్తం చేస్తూ చిరు స్వయంగా మాట్లాడి చెప్పడంతో ఐశ్వర్య రాజేష్ షాక్ అయిపోయి నోటమాట రాలేదు.

ఈ స్వీట్ మెమరీని స్వయంగా ట్విట్టర్ లో షేర్ చేసుకున్న ఈ అమ్మాయి మెసేజ్ లోనే చాలా ఎగ్జైట్ మెంట్ కనిపించింది. కౌసల్య కృష్ణమూర్తి నిర్మాత కేఎస్ రామారావు చిరుకు ఎంత సన్నిహితుడో తెలిసిన విషయమే. ఈయన గత ఏడాది తీసిన తేజ్ ఐ లవ్ యు ప్రీ రిలీజ్ కు గెస్ట్ గా వచ్చింది చిరునే. ఆ అనుబంధంతోనే మరోసారి ఇలా టీజర్ రిలీజ్ కు సహాయపడుతున్నారు చిరు. మెగాస్టార్ సపోర్ట్ తోడయ్యింది కాబట్టి కౌసల్య కృష్ణముర్తికి అదనంగా బజ్ వచ్చేస్తుంది