Begin typing your search above and press return to search.

మహేష్ మాకు చాలా క్లోజ్ -మెగాస్టార్

By:  Tupaki Desk   |   2 May 2018 6:09 AM GMT
మహేష్ మాకు చాలా క్లోజ్ -మెగాస్టార్
X
SMS సినిమా ద్వారా హీరోగా పరిచయమైన మహేష్ బాబు బంధువు సుదీర్ బాబు ప్రేమ కథ చిత్రంతో బిగ్గెస్ట్ హిట్ అందుకున్నాడు. ఆ తరువాత ఎన్ని అవకాశాలు వచ్చినప్పటికీ సుదీర్ బాబు అనుకున్నంత రేంజ్ లో హిట్ అందుకోలేదు. దాదాపు గత నాలుగేళ్ల నుంచి పదుల సంఖ్యలో సినిమాలు చేసినప్పటికీ స్టార్ దర్శకుల దృష్టిలో కూడా పడలేదు. అయితే తన సినిమాల రేంజ్ పెరగాలంటే స్టార్స్ హెల్ప్ అవసరం అనుకున్నాడో ఏమో గాని సుదీర్ ఏకంగా మెగాస్టార్ ని రంగంలోకి దింపాడు.

తన ఫ్యామిలిలో సూపర్ స్టార్ మహేష్ బాబు ఉన్నప్పటికీ మెగా స్టార్ ని పిలిచి సమ్మోహనం టీజర్ లాంచ్ చేయించుకున్నాడు. అలాగే ఆయన్ను ఇంటర్వ్యూ చేసి మెగా అభిమానుల దృష్టిలో పడ్డాడు. చీరంజీవి నుంచి చిత్ర యూనిట్ మంచి ప్రశంసలను అందుకుంది. అలాగే దర్శకుడు మోహన్ కృష్ణ ఇంద్రగంటి గురించి కూడా మెగాస్టార్ పాజిటివ్ కామెంట్స్ చేశారు. సినిమా చూడాలనిపిస్తుంది అన్నట్లు సినిమా ఫ్రెష్ లవ్ స్టోరీలా ఉంటుందనే ఆసక్తి కనిపిస్తోందని చెప్పారు.

ఈ చిట్ చాట్ లో మెగాస్టార్ మహేష్ గురించి ప్రస్తావిస్తూ.. మహేష్ మా కుటుంబ సభ్యులందరికి చాలా ఇష్టం. మాతో కూడా తను చాలా ఫ్రెండ్లిగా ఉంటాడు. మహేష్ సినిమా ఏదైనా మొదటి షోకే అంతా కలిసి వెళతాము. రీసెంట్ గా వచ్చిన భరత్ అనే నేను సినిమా చూసి చాలా సంతోషించాం. సినిమాలో మహేష్ నటన చాలా అద్భుతంగా ఉందని సినిమా చూడగానే వెంటనే మహేష్ కి ఫోన్ చేసి కంగ్రాట్స్ చెప్పను అని చిరంజీవి మాట్లాడారు. ఇక లవ్ స్టోరీ లాంటి సినిమాలు కూడా అవకాశం వస్తే చేస్తానని సుదీర్ తో మెగాస్టార్ తెలియజేశారు.