చిరు భుజానికి చిన్న సర్జరీ??

Wed Sep 13 2017 16:13:54 GMT+0530 (IST)

150 పైగా సినిమాల్లో నటించి తెలుగు ప్రేక్షకుల అభిమానాన్ని గెలుచుకున్న హీరో మెగాస్టార్ చీరంజీవి. రాజకీయాల్లో కూడా అడుగులు వేసినా.. అభిమానులు మాత్రం ఆయనను మళ్లీ సినిమాల వైపు దారి మళ్లించారు. ఖైదీ నెంబర్ 150తో హిట్ అందుకొని నిజంగానే బాస్ ఈజ్ బ్యాక్ అనిపించుకున్నాడు. అయితే అయన తీయబోయే తరువాత సినిమా ఆయన కెరీర్ లోనే ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్నసంగతి తెలిసిందే.సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రామ్ చరణ్ నిర్మిస్తున్న "సైరా"ని సినిమాని ఇప్పటికే స్టార్ట్ చేశారు. ఇక అసలు విషయంలోకి వస్తే మెగాస్టార్ గత కొన్ని నెలలుగా ముంబై లోని ప్రముఖ ఆర్థోపెడిక్ సర్జన్ డా.సంజయ్ ని కలుస్తున్నారట. ఎందుకంటే చిరు ఈ మధ్య బుజం నొప్పితో బాధపడుతున్నారట. దీంతో ఆ ప్రముఖ డాక్టర్ గత కొన్ని వారాలుగా చిరుకి ట్రీట్ మెంట్ చేసి పూర్తిగా కోలుకునే వరకు విశ్రాంతి తీసుకోవాలని చెప్పారట. దీంతో డాక్టర్ చెప్పినట్టుగా అయన పర్యవేక్షణలో కొన్ని రోజులవరకు ఉండి పూర్తిగా కోలుకున్న తర్వాత ఇక హ్యాపీగా షూటింగ్ చేసుకొమ్మని చెప్పారట. చిరుకి వైద్యం అందించిన డాక్టర్ సంజయ్ ఇంతకుముందు షారుక్ వంటి వారికి కూడా తన వైద్యాన్ని అందించారట.ఇక ఫైనల్ గా చిరు లాస్ట్ వీక్ లోనే పూర్తిగా కోలుకొని సైరా యుద్ధ పోరాటాల విన్యాసాలను నేర్చుకుంటున్నాడట.      

ఆల్రెడీ తన 151వ సినిమాగా సైరా ను ప్రకటించిన చిరంజీవి.. ఆగస్టు నుండి ఆ సినిమా రెగ్యులర్ షూటింగ్ చేస్తారని టాక్. ఇప్పుడు భుజం నొప్పి కారణంగా ఒకవేళ షూటింగ్ లేటవుతుందా లేదంటే షెడ్యూల్ ప్రకారమే టేకాఫ్ అవుతుందో చూడాలి.