Begin typing your search above and press return to search.

మిమ్మల్ని గెలిపించడానికి వస్తున్నాను -చిరు

By:  Tupaki Desk   |   1 Oct 2016 6:10 PM GMT
మిమ్మల్ని గెలిపించడానికి వస్తున్నాను -చిరు
X
మెగాస్టార్ చిరంజీవి ఈరోజు సాయంత్రం మాటివిలో తన సరిక్రొత్త ప్రోమోతో అదరగొట్టేశారనే చెప్పాలి. అందరూ ఎదురు చూస్తున్నట్లే అక్టోబర్ 1న సాయంత్రం 7 గంటలకు మా టివి వారు ''మీలో ఎవరు కోటీశ్వరుడు'' తొలి ప్రోమోను విడుదల చేశారు. ఈ ప్రోమోలో చిరంజీవి లుక్స్ యాజూజువల్ డ్యాషింగ్ గానే ఉన్నాయని చెప్పాలి. ఇకపోతే ఆయన పలికిన డైలాగులు బాగున్నాయి.

''వెండితె మీద మీరు నన్ను గెలిపించారు. బుల్లితెరమీద నేను మిమ్మల్ని గెలిపించడానికి వస్తున్నాను. కమాన్. లెట్స్ ప్లే'' అంటూ చిరంజీవి తనదైన స్టయిల్లో స్టయిలిష్‌ గా డైలాగ్ చెబుతూ ప్రోమోలో అదరగొట్టేవారు. ఇక మా టివి క్రియేటివ్ టీమ్ కూడా ఈ ప్రోమోను చాలా అద్భుతంగా రూపొందించిందనే చెప్పాలి. అలాగే అక్టోబర్ 11 నుండి సీజన్ 4 తాలూకు ఎంట్రీలను ఓపెన్ చేస్తున్నారు కాబట్టి.. బహుశా డిసెంబర్ లో ఈ కార్యక్రమాన్ని ప్రసారం చేసే ఛాన్సుంది.

ఇకపోతే ఈ కార్యక్రమంతో చిరంజీవి బుల్లితెర మీద ఎలాంటి రచ్చ చేస్తారో చూడాలనేది అందరి ఆకాంక్ష. ఇప్పటికే సదరు కార్యక్రమానికి నాగార్జున ఆల్రెడీ మాంచి క్రేజ్ తెప్పించారు.. ఇప్పుడు చిరంజీవి ఇంకాస్త రేంజు పెంచి హిందీలో అమితాబ్‌ బచ్చన్ చేసిన దానికంటే ఎక్కువగా ఎచీవ్ చేస్తారేమో చూడాలి.