Begin typing your search above and press return to search.

కౌశల్యను మెచ్చుకున్న మెగాస్టార్‌

By:  Tupaki Desk   |   18 Jun 2019 3:07 PM GMT
కౌశల్యను మెచ్చుకున్న మెగాస్టార్‌
X
ఐశ్వర్యా రాజేష్‌ కీలక పాత్రలో భీమినేని శ్రీనివాసరావు దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'కౌసల్య కృష్ణమూర్తి'. ఈ చిత్రానికి ది క్రికెటర్‌ అనేది ట్యాగ్‌ లైన్‌. క్రికెట్‌ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రంలో ఒక పల్లెటూరు అమ్మాయి క్రికెట్‌ పై ఇష్టంతో పడ్డ కష్టం ఏంటీ.. ఆమె ఎలా ఉన్నత శిఖరాలను అధిరోహించింది అనేది ఈ చిత్రంలో చూపించబోతున్నారు. తాజాగా టీజర్‌ ను చిరంజీవి చేతుల మీదుగా విడుదల చేయించిన విషయం తెల్సిందే. ఈ చిత్రం టీజర్‌ విడుదలకు చిరంజీవి ముందుకు రావడంతో సినిమా గురించి ఒక్కసారిగా ఇండస్ట్రీలో చర్చ మొదలైంది. త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న కౌశల్య కృష్ణమూర్తి సినిమా ప్రస్తుతం అందరిలో ఆసక్తిని రేకెత్తిస్తోంది.

కౌశల్య కృష్ణమూర్తి టీజర్‌ విడుదల సందర్బంగా చిరంజీవి మాట్లాడుతూ.. మన ఇండియాలో స్పోర్ట్స్‌ నేపథ్యంలో వచ్చిన సినిమాలకు మంచి ఆధరణ ఉంటుంది. ముఖ్యంగా క్రికెట్‌ నేపథ్యంలో సినిమాను తప్పకుండా ప్రేక్షకులు ఆధరిస్తారు. నేషనల్‌ గేమ్‌ లాంటి క్రికెట్‌ నేపథ్యంలో వస్తున్న ఈ చిత్రం తప్పకుండా అందరిని ఆకట్టుకుంటుంది. సాదారణ రైతు బిడ్డ అయిన ఒక అమ్మాయి పట్టుదలతో అంతర్జాతీయ స్థాయికి ఎలా ఎదిగిందనే విషయాన్ని చూపించారు. ఈ చిత్రం కోసం ఐశ్వర్యా నాలుగైదు నెలల పాటు క్రికెట్‌ లో శిక్షణ తీసుకుందని తెలిసింది. ఆమెకు పాత్రపై ఎంతటి డెడికేషన్‌ ఉందో దాన్ని బట్టి అర్ధం చేసుకోవచ్చు.

ఐశ్వర్యా రాజేష్‌ నా కొలిగ్‌ రాజేష్‌ కూతురు అలాగే హాస్య నటి అయిన శ్రీలక్ష్మి గారి మేనకోడలు. మన తెలుగు అమ్మాయిలు హీరోయిన్స్‌ గా రావడం లేదని భావిస్తున్న తరుణంలో ఐశ్వర్యా రాజేష్‌ రావడం ఆహ్వానించదగ్గ పరిణామం. అందరం ఐశ్వర్యాను మనస్ఫూర్తిగా అభినందించాలి. టీజర్‌ చూసిన తర్వాత నాకైతే సినిమా ఎప్పుడెప్పుడు చూస్తానా అంటూ ఆసక్తిగా ఉంది. మంచి సినిమాలు తీసే క్రియేటివ్‌ కమర్షియల్స్‌ లో ఇది మరో మంచి సినిమా అవుతుందనే నమ్మకం నాకుందని ఈ సందర్బంగా చిరంజీవి గారు అన్నారు.

అడిగిన వెంటనే టీజర్‌ లాంచింగ్‌ కు ఒప్పుకున్నందుకు కృతజ్ఞతలు. చిరంజీవి గారితో క్రియేటివ్‌ కమర్షియల్‌ కు ఉన్న అనుబంధం మీ అందరికి తెల్సిందే. మా బ్యానర్‌ లో వచ్చిన ఒక మంచి సినిమాకు చిరంజీవి గారి సపోర్ట్‌ దక్కడం చాలా ఆనందంగా ఉంది. ఇలాంటి సినిమాలకు ఎంకరేజ్‌ మెంట్‌ చాలా అవసరం. అప్పుడే మరిన్ని మంచి సినిమాలు వస్తాయని నిర్మాత కేఎస్‌ రామారావు అన్నారు.

శివ కార్తికేయన్‌ నిర్మించిన తమిళ చిత్రానికి ఇది రీమేక్‌. ఒరిజినల్‌ వర్షన్‌ లో కీలక పాత్రలో నటించిన శివ కార్తికేయన్‌ తెలుగు వర్షన్‌ లో కూడా ఆ పాత్రను పోషిస్తున్న నేపథ్యంలో మరింత ఆసక్తి నెలకొంది. ఈ చిత్రంలో రాజేంద్ర ప్రసాద్‌.. వెన్నెల కిషోర్‌.. జాన్సీ ఇంకా తదితరులు కీలక పాత్రల్లో నటించారు.