Begin typing your search above and press return to search.

సెకండ్ లుక్: చిరు ఇంటెన్సిటీ అదిరింది

By:  Tupaki Desk   |   22 Aug 2016 12:33 PM GMT
సెకండ్ లుక్: చిరు ఇంటెన్సిటీ అదిరింది
X
ముందుగా మనం చెప్పుకున్నట్లు.. మెగాస్టార్ చిరంజీవి కేవలం బ్యాక్ నుండి కనిపిస్తున్న పోస్టర్ ను.. దానికి సంబంధించి మోషన్ పోస్టర్ ను మాత్రమే రిలీజ్ చేశారు. అయితే ఆ లుక్కు ఎంత బాగున్నప్పటికీ.. ఎందుకో చిరంజీవిని చూస్తున్నాం అనేంత ఫీలింగ్ ఎక్కడా కలగలేదు. అందుకే వెంటనే సెకండ్ పోస్టర్ ను కూడా రిలీజ్ చేశాడు రామ్ చరణ్‌.

చూస్తుంటే మరోసారి స్టాలిన్ వంటి సినిమాల్లో ఉన్న బాడీ లాంగ్వేజ్.. ఇంద్ర సినిమాలోని ఆయన పవర్ ఫుల్ చూపులు.. అన్నీ కలగలిపి ఖైదీ నెం 150 లుక్ అదిరిపోయింది ఇప్పుడు. ముఖ్యంగా చిరంజీవి చూపులోని ఇంటెన్సిటీ కారణంగా.. సినిమా మీద హైప్ పెరుగుతోంది. ఎలాగో ఆల్రెడీ తమిళంలో ప్రూవ్ చేసుకున్న సినిమా.. పైగా అలాంటి హిట్టు కథలను తీసుకుని వాటిని బ్లాక్ బస్టర్ కథలుగా రాయించడం చిరంజీవికి బాగా అలవాటే. దానితో ఈ సినిమాపై ఉన్న అంచనాలను అందుకోవడం పెద్ద కష్టమేం కాదులే. 'బాస్ ఈజ్ బ్యాక్' అనే ట్యాగ్ లైన్ కు పర్ఫెక్టు నిర్వచనం అన్నట్లుంది యవ్వారం.

ఇకపోతే ఇప్పటికే బర్త్ డే టీజర్ - మోషన్ పోస్టర్ - ఫస్ల్ లుక్ పోస్టర్ - రెండో పోస్టర్ డిజైన్లతో ఈరోజు అలరించిన కొణిదెల ప్రొడక్షన్స్ వారు.. సాయంత్రం శిల్పకళావేదికలో జరగబోయే వేడుకలో ఇంకెన్ని ఫీట్లు చేస్తారో చూడాల్సిందే.