Begin typing your search above and press return to search.

డిసెంబర్ 18న ఖైదీ ఆడియో??

By:  Tupaki Desk   |   2 Dec 2016 5:30 PM GMT
డిసెంబర్ 18న ఖైదీ ఆడియో??
X
మెగాస్టార్ చిరంజీవి కంబ్యాక్ మూవీ ఖైదీ నెంబర్ 150శరవేగంగా సిద్ధమైపోతోంది. షూటింగ్ చివరిదశకు చేరుకున్న ఈ మూవీకి.. ఇప్పటికే పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా చేసేస్తున్నారు. ఒక పాట.. ప్యాచ్ వర్క్స్ మినహాయిస్తే.. దాదాపుగా పనులన్నీ పూర్తయిపోయాయి. మరోవైపు ప్రమోషన్స్ కోసం కూడా మెగా టీం రెడీ అయిపోతోంది.

ఖైదీ కోసం గ్రాండ్ లెవెల్లో ఇప్పటివరకూ టాలీవుడ్ లో ఏ సినిమాకు జరగని రేంజ్ లో ఆడియో ఫంక్షన్ చేసేందుకు నిర్ణయించారు. ఇప్పుడీ గ్రాండ్ ఫంక్షన్ కు డేట్ కూడా లాక్ చేసేసుకున్నారట. డిసెంబర్ 18న ఖైదీ నెంబర్ 150 ఆడియో వేడుకను అంగరంగవైభవంగా జరపనున్నారు. ఈ ఫంక్షన్ కి మెగా ఫ్యామిలీ నుంచి పవన్ సహా అందరూ హాజరుకానున్నరని తెలుస్తోంది. మరోవైపు చిరుతో గతంతో పని చేసిన హీరోయిన్లు.. టెక్నీషియన్లను కూడా ఆహ్వానించి.. గచ్చిబౌలి స్టేడియంలో సూపర్బ్ ఈవెంట్ నిర్వహించనున్నారు. ఈ పనులన్నీ నిర్మాత రామ్ చరణ్ భార్య.. ఉపాసన దగ్గరుండి చూసుకుంటున్నట్లు చెబుతున్నారు.

ఆడియో రిలీజ్ నుంచి మొదలుపెట్టి చిన్నపాటి గ్యాప్ కూడా ఇవ్వకుండా ప్రమోషన్స్ చేస్తారట. ఇలా డిసెంబర్ 18కి లాక్ అవడానికి కూడా.. ఆదివారం కావడమే కారణంగా తెలుస్తోంది. ఆ తర్వాతి సండే క్రిస్మస్ కావడంతో.. ఇంకా లేట్ చేస్తే.. ప్రమోషన్స్ కు టైం ఉండదనే ఉద్దేశ్యంతోనే డిసెంబర్ 18ని ఖైదీ నెంబర్ 150 ఆఢియో ఫంక్షన్ కు డేట్ గా నిర్ణయించారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/