‘150’కి పెద్ద పంచ్ పడిందే..

Thu Jan 12 2017 09:47:14 GMT+0530 (IST)

మొత్తానికి మెగాస్టార్ చిరంజీవి రీఎంట్రీ  ఇచ్చేశాడు. ఆయన 150వ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. సినిమా ఎలా ఉంటుందని ఆశించారో అలాగే ఉంది. మెగా అభిమానుల్ని చిరంజీవి ఉర్రతూలూగించాడు. ఏ రకంగానూ తనలో స్టామినా తగ్గలేదని రుజువు చేశాడు. ఈ సినిమాకు అనూహ్యమైన ఓపెనింగ్స్ వచ్చేలా కనిపిస్తోంది. దాదాపుగా అన్ని ఏరియాల్లోనూ నాన్-బాహుబలి రికార్డులకు మూడినట్లే కనిపిస్తోంది. కొన్నిచోట్ల ‘బాహుబలి’ రికార్డులకు కూడా చిరు సినిమా ఎసరు పెట్టినట్లే ఉంది. ఐదు రోజుల లాంగ్ వీకెండ్.. సంక్రాంతి సెలవులు ఈ సినిమాకు బాగా కలిసొచ్చేలా ఉన్నాయి. కాబట్టి ఫుల్ రన్ కకలెక్షన్లలోనూ కొత్త రికార్డులు నమోదవడం ఖాయంగా కనిపిస్తోంది.

ఐతే అంతా బాగుంది కానీ.. సినిమా విడుదలైన తొలి రోజే ఆన్ లైన్లో ఈ సినిమా పాటలు లీక్ అయిపోవడం పెద్ద మైనస్సే. అరబ్ దేశాల్లో ఈ సినిమాను పైరసీ చేసేసినట్లు తెలుస్తోంది. కాకపోతే సినిమా ఎక్కడా లీక్ కాలేదు కానీ.. పాటలన్నింటినీ నెట్లో పెట్టేశారు. యూట్యూబ్ లో ఈ సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా అనుకుంటున్న పాటలన్నింటినీ రకరకాల పేర్లతో పెట్టేశారు. వాట్సాప్ లో అమ్మడు కుమ్ముడు పాట హల్ చల్ చేస్తోంది. చిరు-చరణ్ కలిసి చేసిన ఈ పాట బయటికి రావడం కచ్చితంగా ‘ఖైదీ నెంబర్ 150’కు ఎదురు దెబ్బే. చిరు రీఎంట్రీ మూవీలో కంటెంట్ కంటే కూడా ఎక్కువ చిరు డ్యాన్సులు ఎలా చేశాడన్న దాని మీదే జనాలకు ఎక్కువ ఆసక్తి ఉంది. ఆ ఆసక్తితోనే థియేటర్లకు పరుగులు పెడుతున్నారు. సినిమాకు రిపీట్ వాల్యూను తీసుకొచ్చేది కూడా పాటలే. ఐతే ఆ పాటల్నే లీక్ చేసేయడంతో కచ్చితంగా కొంత ప్రతికూల ప్రభావం ఉంటుందనడంలో సందేహం లేదు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/