Begin typing your search above and press return to search.

బాస్ ఈజ్ బ్యాక్ కాదు.. 'రతాలు రతాలు'

By:  Tupaki Desk   |   27 Oct 2016 4:34 AM GMT
బాస్ ఈజ్ బ్యాక్ కాదు.. రతాలు రతాలు
X
మెగాస్టార్ చిరంజీవి 150వ చిత్రం ఖైదీ నెంబర్ 150పై ప్రేక్షకుల్లో మెగాభిమానుల్లో బోలెడన్ని ఆశలు-అంచనాలు ఉండడంతో ఈ సినిమాకి సంబంధించిన ప్రతీ అప్ డేట్ హాట్ టాపిక్ అయిపోతోంది. అందుకే చిన్న విషయాన్ని కూడా పెద్దగా చూసేసి హంగామా చేసేస్తున్నారు. రీసెంట్ గా సినిమా యూనిట్ లో ఒకరు.. 'బాస్ ఈజ్ బ్యాక్.. సూపర్బ్ డ్యాన్స్ బీట్ తో సాంగ్ చేశాం.. మెగాస్టార్ ఎనర్జీ అదుర్స్ ' అని ట్వీట్ చేస్తే.. ఆ పాట బాస్ ఈజ్ బ్యాక్ అని సాగుతుందనే హంగామా నడిచేసింది.

కానీ ఈ పాట బాస్ ఈజ్ బ్యాక్ కాదు. లారెన్స్ రాఘవ కొరియోగ్రఫీలో.. లక్ష్మీరాయ్ ఐటెం భామగా నటించిన ఈ పాట.. 'రతాలు రతాలు' అంటూ సాగుతుంది. ఆ పాట గురించే చెబుతూ లీక్ ఇవ్వడం ఇష్టంలేని యూనిట్ వర్గాలు.. మెగాస్టార్ గురించి బాస్ ఈజ్ బ్యాక్ అని చెప్పారంతే. కానీ ఆ ట్యాగ్ లైన్ బ్రూస్ లీ విషయంలో తేడా చేయడంతో.. అభిమానుల్లో టెన్షన్ మొదలైతే.. ట్రాలింగ్ కూడా ఎక్కువ కూడా జరిగింది.

దీంతో డ్యామేజ్ కంట్రోల్ కోసం రంగంలోకి దిగిన యూనిట్.. ఐటెం పాటకు పల్లవి ఏంటో మెల్లగా బయటపెట్టేసింది. అఫ్ కోర్స్.. ఇది అఫీషియల్ గా అనౌన్స్ మెంట్ కాకపోయినా.. ఖైదీ నెంబర్ 150 నుంచి అందుతున్న ఇన్ఫర్మేషన్ కావడంతో.. ఇప్పుడు ఫ్యాన్స్ హంగామా చేసేసుకోవచ్చు.


Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/