Begin typing your search above and press return to search.

సినిమాపై చిరు పట్టు.. ఓ సలాం కొట్టు

By:  Tupaki Desk   |   23 Jan 2017 5:28 AM GMT
సినిమాపై చిరు పట్టు.. ఓ సలాం కొట్టు
X
ఖైదీ నెంబర్ 150 టాలీవుడ్ లో చరిత్రను తిరగరాసే పనిలో బిజీగా వుంది. ఎప్పటినుండో చెక్కుచెదరని రికార్డులు చిరు రీ ఎంట్రీ తరువాత కనుమరుగవుతున్నాయి. ఒక రీమేక్ సినిమాకు ఇన్ని రికార్డులా అని తక్కిన భాషల చిత్రసీమ ఆశ్చర్యపోతుంది. దీని వెనుక హీరోగానే కాక తక్కిన ఎన్నో పాత్రలు షాడోలో పోషించిన చిరుకే ఈ ఘనతంతా. 150 సినిమాల అనుభవం ఆయన సొంతం. పునాదిరాళ్ళనుండీ పైకొచ్చిన నేపథ్యంలో దాదాపు సినిమాలో ముఖ్యమైన ప్రతీ విభాగంలోనూ పట్టు తెచ్చుకోగలిగాడు చిరంజీవి.

బెస్ట్ ఎంటర్టైనర్ గా నిలవాలంటే కొన్ని సీన్లతో బి - సి సెంటర్ల ప్రేక్షకులను అలరించాలి. కొన్ని సీన్లతో మల్టీప్లెక్స్ ఆడియన్స్ ని మెప్పించాలి. పతాక సన్నివేశాలలో ఫ్యామిలీ ఆడియన్స్ ప్రేమను చొరగొనాలి. ఇవన్నీ సమపాళ్ళలో కలిపి అందించడం కాసింత కష్టమే. ఎడిటింగ్ రూమ్ లో చిరు జడ్జిమెంట్ కి తిరుగు లేదనే వార్త చాలా సార్లే విన్నాం. ఉదాహరణకి ఖైదీ.. సినిమాలో 30 ఇయర్స్ పృథ్విపాత్ర ఏమంత అవసరంలేదు. ఆ రెండు సన్నివేశాలూ ఎక్సట్రానే. అందుకే వాటిని ఎడిట్ చేశాడు చిరు. అయితే పృథ్వి బాధపడడంతో తిరిగి జాయిన్ చేశారు.

రామ్ చరణ్ తొలినాళ్ళలో నటించిన ప్రతీ సినిమాను చిరునే దగ్గరుండి ఎడిట్ చేశారని వార్తలు వినిపించేవి. ఇదేకాక సంగీతం - డ్యాన్స్ - ఫైట్స్ విషయంలో ప్రత్యేక శ్రద్ధతీసుకోవడం వల్లే చిరు సకలజనారంజకుడు అయ్యాడు. మరి నేటి యువహీరోలంతా ఆయన్ని అనుసరిస్తే మంచిదేమో.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/