Begin typing your search above and press return to search.

చిరు ఫ్యామిలీ: ఈ సారి ఆ ట్రెడిషన్ మిస్ అయిందే!

By:  Tupaki Desk   |   17 Jan 2019 6:35 AM GMT
చిరు ఫ్యామిలీ: ఈ సారి ఆ ట్రెడిషన్ మిస్ అయిందే!
X
మెగాస్టార్ చిరంజీవి ప్రతి ఏడాది సంక్రాంతి పండగ బెంగళూరులోని తన ఫామ్ హౌసులో జరుపుకుంటారు. ఒక్క చిరు ఫ్యామిలీనే కాకుండా దాదాపు మెగా ఫ్యామిలీ అందరూ కలిసి మూడురోజుల పాటూ అక్కడే ఉంటారు. కానీ ఈసారి మాత్రం ఆ ట్రెడిషన్ కు బ్రేక్ పడింది. 'సైరా' షూటింగ్ ను వీలైనంత త్వరగా పూర్తి చేయాలనే ఆలోచనలో ఉన్న చిరు బ్రేక్ తీసుకోకుండా షూటింగ్ లో పాల్గొన్నారట.

దర్శకుడు సురేందర్ రెడ్డి 'సైరా' షూటింగ్ లో భాగంగా ఒక కీలకమైన సీన్ ను చిత్రీకరించాడని సమాచారం. ఈ సినిమా బ్రిటిష్ వారు భారతదేశాన్ని పాలించిన కాలం నేపథ్యంలో ఉంటుందని తెలిసిందే. ఆ సమయంలో రాయలసీమ ప్రాంతంలో తీవ్రమైన కరువుపరిస్థితులు వచ్చాయట. అలాంటి పరిస్థితిని పట్టించుకోకుండా ఉయ్యాలవాడ నరసింహారెడ్డి తన సహాయకులతో కలిసి పొలాన్ని దున్నుతూ వర్షాలు వాస్తాయని ఆశాభావం వ్యక్తం చేసే సన్నివేశాన్ని సురేందర్ రెడ్డి తెరకెక్కిస్తున్నాడట. సంక్రాంతి రోజున ఇలా పొలం దున్నే సన్నివేశం చిత్రీకరించడం చిరును ఎంతో సంతోషపెట్టిందని సమాచారం.

భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న 'సైరా' ను మొదట ఇండిపెండెన్స్ డే సందర్భంగా రిలీజ్ చేస్తారని అన్నారు గానీ తర్వాత దసరా సీజన్లో విడుదల అని కూడా వార్తలు వచ్చాయి. కానీ రిలీజ్ డేట్ విషయంపై ఇంకా 'సైరా' టీం నుంచి అధికారికంగా ధృవీకరణ రాలేదు.