Begin typing your search above and press return to search.

ఫోటోస్టోరీ: మళ్లీ మళ్లీ చూడాలని ఉంది

By:  Tupaki Desk   |   3 Dec 2016 3:24 AM GMT
ఫోటోస్టోరీ: మళ్లీ మళ్లీ చూడాలని ఉంది
X
మెగాస్టార్ మెగా సెన్సేషన్స్ కి సర్వం సిద్ధమవుతున్నాయి. ఇప్పటికే ఖైదీ నెంబర్ 150కి టాకీపార్ట్ మొత్తం షూట్ పూర్తికాగా.. ఇప్పుడు ఒకపాట షూటింగ్ జరుగుతోంది. ఇప్పటికే ఈ ఆఖరి సాంగ్ షూట్ మొదలైపోగా.. కొన్ని రోజుల్లోనే దీన్ని పూర్తి చేసి.. పోస్ట్ ప్రొడక్షన్-ప్రమోషన్ కార్యకలాపాలపై పూర్తి స్థాయిలో దృష్టి పెడుతున్నారు.

ఖైదీకి సంబంధించిన ప్రతీ అప్ డేట్ మెగా ఫ్యాన్స్ తో పాటు ఇండస్ట్రీ వర్గాల్లో బోలెడంత బజ్ క్రియేట్ చేస్తుండగా.. షూటింగ్ స్పాట్ కి సంబంధించిన కొన్ని ఫోటోలు బోలెడంత ఆసక్తిని జెనరేట్ చేస్తున్నాయి. ఓ పిల్లర్ నుంచి చిరు దొంగచూపులు చూస్తున్నట్లుగా ఇచ్చిన ఓ రొమాంటిక్ లుక్.. మెగాస్టార్ లో చిలిపితనాన్ని కళ్లకు కడుతోంది. ఓల్డేజ్ హోమ్ కి సంబంధించిన సీన్స్ లో.. హీరోయిన్ కి చిరంజీవి లైన్ వేసే సీన్ లో భాగంగా ఈ లుక్ వస్తుందట. ఇలాంటి లుక్స్ మెగా మూవీస్ లో గతంలో కూడా కొన్ని తగులుతాయి.

చూడాలని ఉంది టైమ్ నుంచి.. చిరు ఇలాంటి చిలిపిచూపులతో హీరోయిన్లకు గిలిగింతలు పెడుతూ ఉంటారు. ఇప్పుడు మరోసారి తన చూపులతో కాజల్ ని.. కలెక్షన్స్ తో బాక్సాఫీస్ ని కేరింతలు పెట్టేందుకు జనవరి 11న ఖైదీ నెంబర్ 150గా వచ్చేస్తున్నారు మెగాస్టార్ చిరంజీవి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/