పదేళ్ళు మిస్సయ్యాం అంటూ ఏడుస్తున్నారు

Wed Jan 11 2017 13:52:07 GMT+0530 (IST)

ఇప్పుడు టివిల్లో ఎక్కడ చూసినా కూడా అసలు మెగాస్టార్ చిరంజీవి కంబ్యాక్ మూవి ''ఖైదీ నెం 150'' పై రెస్పాన్స్ ఎలా ఉందంటూ.. సినిమా చూసి బయటకొస్తున్న ప్రేక్షకులను అడిగి తెలుసుకోవడం మనం గమనించవచ్చు. ఈ సందర్భంగా కొందరు అభిమానులు రియాక్ట్ అవుతున్న తీరును చూస్తుంటే అవాక్కయిపోవాలి.

''ఈ ఏజ్ లో అభిమానుల కోసం అంత కష్టపడి.. కళామతల్లి పులకరించేలా చిరంజీవి కంబ్యాక్ ఉంది. బాస్ ఈజ్ రియల్లీ బ్యాక్. గ్రేస్ స్టెప్స్ కాని.. కామెడీ కాని.. ఎమోషనల్ సీన్లు కాని.. ఆయన నటన అద్భుతం'' అంటూ అభిమానులు మూకుమ్మడిగా చెప్పేస్తున్నారు. అయితే కొందరు అభిమానులైతే కళ్లమ్మెట నీళ్లు పెట్టుకోవడం.. ఏడ్చేయడం.. 10 ఏళ్ళు ఆయన మాకు ఎందుకు దూరమయ్యారు అంటూ ఏడవడం చూస్తుంటే.. అభిమానం ఇలా ఉంటుందా అని అవాక్కైపోవాల్సిందే. పద్దేళ్లు మిస్సయ్యాం అంటూ అందరూ జెన్యూన్ గా ఎమోషనల్ అయిపోవడం చూస్తుంటే.. చిరంజీవి కూడా కంటతడి పెట్టుకుంటారేమో అనే అనిపిస్తోంది.

ప్రస్తుతానికి తెలుగు రాష్ట్రంలలో తొలి రోజుకు సంబంధించి భారీగా టిక్కెట్లన్నీ అమ్ముడుపోయి హౌజ్ ఫుల్స్ అయిపోగా.. అలాగే తదుపరి రోజులకు కూడా దాదాపు హౌస్ ఫుల్సే. ఇదంతా కూడా మెగాస్టార్ మెగా ప్రభంజనం అనే చెప్పుకోవాలి.Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/