Begin typing your search above and press return to search.

మెగా ఫ్యామిలీ 'దీపావళి' మొదలైంది

By:  Tupaki Desk   |   19 Oct 2017 9:03 AM GMT
మెగా ఫ్యామిలీ దీపావళి మొదలైంది
X

వెలుగులు నింపే దీపావళి పండగ అంటే ప్రతి ఒక్కరికి ఇష్టమే. అప్పటివరకు సైలెంట్ గా సాగిన జీవితంలో ఒక్కసారిగా దీపావళి జోరుగా టపాసుల మోతతో అలాగే కాంతుల జల్లులతో మనిషికి ఎంతో ఉత్తేజాన్ని ఇస్తుంటుంది. సాధారణ ప్రజల నుండి ప్రతి గొప్పవారు ఎవరి స్టైల్ లో వారు దీపావళిని హ్యాపీగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు.

ముఖ్యంగా సెలబ్రెటీలు కూడా వారి బంధువులతో దీపావళి వేడుకలను ఎంతో ఆనందంగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. టాలీవుడ్ లో కూడా కొంత మంది తారలు నిన్ననే మొదలు పెట్టేశారు. ముఖ్యంగా మెగాస్టార్ ఇంట్లో దీపావళి వేడుకలు చాలా అట్టహాసంగా మొదలయ్యాయి. చీరంజీవి తన కుటుంబంతో కలిసి దీపావళిని సెలబ్రేట్ చేసుకున్నారు. సాయి ధరమ్ తేజ్ కూడా మావయ్యతో కలిశాడు. అందుకు సంబందించి ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక అల్లు అర్జున్ కూడా తన దర్శకులతో కలిసి సెలబ్రేట్ చేసుకున్నాడు. సుకుమార్ - సురేందర్ రెడ్డి తో దిగిన ఫొటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఇక రామ్ చరణ్ కూడా తన అత్తగారింటికి వెళ్లి దీపావళి వేడుకలను మొదలెట్టేసాడు. ఉపాసనతో ఫొటోస్ దిగి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. అయితే ఈ తరహా దీపావళి వేడుకలను ఇంతకుముందు బాలీవుడ్ లో అమితాబ్ బచ్చన్ సెలబ్రేట్ చేసుకునే వారు. సినీ ప్రముఖులను పిలిపించి ఆయన ప్రతి దీపావళి సంతోషాలని ఇతరులతో పంచుకునే వారు. ఇప్పుడు మెగా ఫ్యామిలీ కూడా అదే తరహాలో దీపావళి పండగ హ్యాపీని అందరితో షేర్ చేసుకుంటోంది.