Begin typing your search above and press return to search.

151లో కూడా రిపీట్ చేస్తున్న చిరు

By:  Tupaki Desk   |   24 March 2017 8:16 AM GMT
151లో కూడా రిపీట్ చేస్తున్న చిరు
X
మెగాస్టార్ చిరంజీవి కొత్త సినిమా కన్ఫాం అయిపోయంది. స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితాన్ని సినిమాగా మలచనున్నారు మెగాస్టార్. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన అఫీషియల్ అనౌన్స్ మెంట్ ఒకటే పెండింగ్. గతంలోనే పరుచూరి బ్రదర్స్ సిద్ధం చేసిన స్క్రిప్ట్ కు.. దర్శకుడు సురేందర్ రెడ్డి తన స్టైలిష్ మేకింగ్ కి తగినట్లుగా మార్పులు చేర్పులు చేసుకుని రెడీ అయిపోయాడు.

ఏప్రిల్ లో షూటింగ్ ప్రారంభించుకోనున్న ఈ మూవీకి సంబంధించిన అప్డేట్ ఇప్పుడు అందరినీ అట్రాక్ట్ చేస్తోంది. తన 151వ చిత్రంగా తెరకెక్కనున్న ఉయ్యాలవాడ నరసింహారెడ్డి చిత్రంలో కూడా.. తన 150వ సినిమా సెంటిమెంట్ రిపీట్ చేయనున్నారు చిరంజీవి. ఖైదీ నంబర్ 150లో మెగాస్టార్ రెండు పాత్రల్లో నటించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఉయ్యాలవాడ జీవిత చరిత్రలో కూడా చిరు రెండు రోల్స్ లో నటించనున్నారని తెలుస్తోంది. అందుకు తగినట్లుగానే ఇద్దరు హీరోయిన్లు సినిమాల ఉంటారట.

గొరిల్లా యుద్ధం మాదిరిగా సాగే వీర చరిత్రే అయినా.. మరోవైపు ఓ ట్రయాంగిల్ లవ్ స్టోరీ కూడా ఈ చిత్రంలో ఉంటుందిట. అందుకే రెండు పాత్రల్లో మెగాస్టార్ కనిపించనున్నారని తెలుస్తోంది. చిరంజీవి డ్యుయల్ రోల్స్ లో కనిపించనుండడం.. ఈ సినిమాకి అదనపు ఆకర్షణ కానుంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/