ఫోటో స్టోరి: శ్రీజ ఫ్యామిలీ అదిరే

Wed Oct 18 2017 16:36:37 GMT+0530 (IST)

మనం ఏమాటకు ఆమాటే చెప్పుకోవాలంటే మాత్రం.. మన సొసైటీలో ఇంకా సంప్రదాయవాదులే ఎక్కువ. వారికి ఏదీ పట్టాన నచ్చదు. అందుకే మనకు ఒక అమ్మాయి రెండో పెళ్ళి చేసుకున్నా వింతే.. లేదంటే మొగుడికి విడాకులు ఇచ్చేసి విడిగా ఉంటున్నా కూడా విశేషమే. అయితే అలా స్ర్తీ ఇండిపెండెంట్ గా ఉండాలనే కదా.. వీరేశలింగం పంతులు వంటి పెద్దలు అవిరళ కృషి చేసింది!!ఇప్పుడు ఈ వేదాంతం అంతా ఎందుకంటే.. మెగా ఫ్యామిలీకి చెందిన ఒక ఫోటో ఇప్పుడు చాలామందిని విస్మయపరుస్తోంది. తను ప్రేమించు పెళ్లిచేసుకున్న వ్యక్తి దగ్గర నుండి విడిపోయిన మెగాస్టార్ చిరంజీవి కూతురు శ్రీజ.. ఆ తరువాత కళ్యాణ్ అనే మరో వ్యక్తిని చేసుకున్నారు. అయితే ఈ రెండో పెళ్ళి మెగా కుటుంబం సాక్షిగా చాలా గ్రాండ్ గా జరిగింది. ఈ పెళ్ళి వీడియోలను చూసివారందరూ చిరంజీవి తండ్రి ప్రేమకు ఫిదా అయిపోయారంతే. ఇప్పుడిక ఫోటో విషయానికొస్తే.. తన తొలి భర్తతో కలిగిన సంతానం.. కూతురు నివృతితో.. శ్రీజ అండ్ కళ్యాణ్ ఒక ఫోటో దిగడం.. అందులో కళ్యాణ్ అండ్ శ్రీజ మధ్యలో ఉన్న అనుబంధం.. అద్భుతంగా ఉందంతే.

ఇంకా సాంప్రదాయమైన సంకెళ్లలో బందీలుగా ఉంటున్నవారికి.. ఒక పెళ్ళి ఫెయిల్ అయితే జీవితం ఈజ్ ఓవర్ అనుకుంటున్న వారికి.. ఇదొక నిజమైన కనువిప్పు అని కూడా మనం చెప్పుకోవచ్చేమో.