Begin typing your search above and press return to search.

ఖైదీ నెం. 150.. డ్యాన్స్ బిట్ లీక్!!

By:  Tupaki Desk   |   11 Dec 2016 6:16 AM GMT
ఖైదీ నెం. 150.. డ్యాన్స్ బిట్ లీక్!!
X
మెగాస్టార్ కం బ్యాక్ మూవీ ఖైదీ నెంబర్ 150 కోసం చాలానే జాగ్రత్తలు తీసుకుంటున్నారు. మరీ గుప్పిట్లో మూసి ఉంచితే.. లేని పోని హైప్ తో పాటు.. లీకుల బెడద పెరిగిపోతుందనే ఉద్దేశ్యంతో.. ఎప్పటికప్పుడు సినిమా అప్ డేట్స్ తో పాటు.. ఖైదీకి సంబంధించిన ఫోటోలను కూడా ఇస్తోంది కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ.

అయినా సరే చిరంజీవి సినిమాకి లీకుల బెడద తప్పడం లేదు. రీసెంట్ గా చిరంజీవి-కాజల్ పై ఓ సూపర్ మాస్ బీట్ పిక్చరైజ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ పాట తోనే షూటింగ్ ఫినిష్ చేసినట్లు చెబుతున్నారు. అయితే.. ఈ పాట షూటింగ్ సమయంలో ఓ వ్యక్తి చిరు-కాజల్ కలిసి స్టెప్పులు వేస్తున్నపుడు సెల్ ఫోన్ లో షూట్ చేసి నెట్ లో పెట్టేశాడు. ఇప్పుడీ వీడియో నెట్ లో చక్కర్లు కొట్టేస్తోంది. జాగ్రత్తలు తీసుకున్న ఖైదీ యూనిట్.. వీడియో డిలెట్ అయ్యేలా జాగ్రత్తలు తీసుకుంటున్నా.. రకరకాల పేర్లతో మళ్లీ మళ్లీ అప్ డేట్ అయిపోతోంది.

ఆ 30 సెకన్ల బిట్ చూసిన వాళ్లు మాత్రం చిరు డ్యాన్సులు చించేశాడని.. మెగాస్టార్ ఎనర్జీ అదుర్స్ అని చెప్పుకుంటున్నారు. అంతే కాదు కాజల్ అందాలు కూడా స్పెషల్ అట్రాక్షన్ అవుతాయట. అన్నిటికీ మించి.. దేవిశ్రీ ప్రసాద్ అందించి మాస్ మసాలా బీట్ అయితే.. కేకలు పెట్టించేసిందని అంటున్నారు. అన్నీ బాగానే ఉన్నాయ్ కానీ.. ఈ లీకుల గొడవ ముదిరితేనే.. అసలు సమస్య మొదలవుతుంది.