సైరా డబ్బింగ్ కి గుడ్ బై చెప్పేసిన చిరు

Thu Jun 27 2019 14:45:44 GMT+0530 (IST)

ప్రేక్షకుల అనుమానాలు పటాపంచలు చేస్తూ అభిమానుల అంచనాలు పెంచేస్తూ సైరా విడుదల తేదీకి ఒక్కో అడుగు వేసుకుంటూ పోతోంది. అక్టోబర్ 2 ఇంకా అధికారికంగా ప్రకటించనప్పటికీ బిజినెస్ డీల్స్ చేసుకుంటున్న డిస్ట్రిబ్యూటర్ల దగ్గర దీనికి సంబంధించి పక్కా సమాచారం ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇటీవలే డబ్బింగ్ మొదలుపెట్టుకున్న సైరాకు తన వంతు బాధ్యతగా చిరు డబ్బింగ్ వర్క్ ని పూర్తి చేశారు.అది కూడా కేవలం 20 గంటల సమయం మాత్రమే తీసుకుని ఫినిష్ చేయడం పట్ల శబ్దాలయ ల్యాబ్ వర్గాలు కూడా షాక్ తిన్నాయట. ఏదైనా రొటీన్ కమర్షియల్ చిత్రమైతే అది వేరే అనుకోవచ్చు . కానీ సైరా సంగతి వేరు. ప్రతిష్టాత్మక స్వాతంత్ర సమరయోధుడి కథ. సాయి మాధవ్ బుర్ర పరుచూరి బ్రదర్స్ లాంటి లబ్దప్రతిష్టులైన కలాలు దీని కోసం పని చేశాయి అందులోనూ బ్రిటిషర్లను సవాల్ చేసే సీన్స్ లో చాలా పెద్ద పెద్ద సంభాషణలు ఉంటాయి.

వీటన్నింటిని ఇంత తక్కువ టైంలో ఫినిష్ చేయడం విశేషమే. త్వరలో మిగిలిన పాత్రల డబ్బింగ్ పూర్తి చేయబోతున్నారు. కాల్ షీట్స్ చూసుకుని ఒక రోజు హైదరాబాద్ వచ్చి సుదీప్ తన పాత్రకు స్వయంగా గాత్రం ఇవ్వబోతున్నాడు. విజయ్ సేతుపతికి మాత్రం వేరే వాళ్ళతో చెప్పించే అవకాశం ఉంది. జగపతిబాబు బ్రహ్మాజీ తదితరులంతా ఇంకో నెలలో తమ పార్ట్ ని పూర్తి చేస్తారు. మొత్తానికి ఫైనల్ స్టేజి లో సైరా స్పీడ్ అందుకుంది. ఆగస్ట్ 22 ట్రైలర్ రిలీజ్ తో పాటు విడుదల తేదీ అఫీషియల్ గా ప్రకటించే అవకాశం ఉంది