Begin typing your search above and press return to search.

ఫీలింగ్ కి పరిస్థితులతో పనేంటి -చిరంజీవి

By:  Tupaki Desk   |   10 Jan 2017 4:56 AM GMT
ఫీలింగ్ కి పరిస్థితులతో పనేంటి -చిరంజీవి
X
కొన్ని టివి ఛానళ్ళకు మెగాస్టార్ చిరంజీవి ఇచ్చిన ఇంటర్యూ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ముఖ్యంగా టివి9 అండ్ ఎన్.టివి వంటి ఛానళ్ళకు ఇచ్చిన ఇంటర్యూల్లో ఆయన కొన్ని ప్రశ్నలకు ఇచ్చిన సమాధానాలు చూస్తే మైండ్ బ్లాంక్ అవ్వక తప్పదు. ఎంతో సాఫ్టుగా కూడా చిరంజీవి పెద్ద పెద్ద పంచ్ లు వేస్తారనడానికి ఓ రకంగా ఈ ఇంటర్యూ నిదర్శనం. ముఖ్యంగా వర్మ గురించి ఆయన రియాక్ట్ అయిన తీరు చూస్తే అది అర్ధమవుతోంది.

"చిరంజీవిని కానీ.. ఆయన వర్గాన్ని కానీ ఎప్పుడు ఏమన్నా ఎవరేమన్నా రియాక్షన్స్ ఉండవు. అందుకే ఆయన సాఫ్ట్ టార్గెట్ అనే మాట వినిపిస్తూ ఉంటుంది" అంటూ ప్రముఖ ఛానల్స్ హోస్ట్ లు అడగ్గా.. 'అయుండచ్చు. చిరంజీవి సాఫ్ట్ టార్గెట్ అనుకుని ఉండొచ్చు. మనం ఏమన్నా ఏం మాట్లాడడు.. ఏం చెప్పడు. కాబట్టి మనం ఏమన్నా పర్లేదు అనుకోవచ్చు. కానీ నెక్ట్స్ జనరేషన్ పిల్లలు కానివ్వండి.. నన్ను అభిమానించేవాళ్లు కానీ ఎందుకు ఊరుకుంటారు. హర్ట్ అవుతారు కదా' అన్నారు మెగాస్టార్.

ఇక వర్మ విషయానికి వస్తే.. ఇంకా ట్వీట్స్ తో ఆన్ లైన్ యుద్ధం చేస్తూనే ఉన్న సంగతి తెలిసిందే. వర్మపై నాగ బాబు కామెంట్స్.. దానికి వర్మ రియాక్షన్ పై కూడా స్పందించారు చిరు. ఈ వివాదం ఇంకా కొనసాగుతోందని అనుకోవచ్చా అనే ప్రశ్న చిరుకు ఎదురైంది. 'ఎప్పుడైతే మా సైడ్ నుంచి రియాక్షన్ కంటిన్యూ అవుతుందో.. అఫ్పుడు ఇంకా ఉందని అనుకోవచ్చు. కానీ మా సైడ్ నుంచి ఇంకేదీ ఉండదు. దాని గురించి ఇంక అనవసరం. నాగబాబు అడగాలని అనుకున్నాడు అడిగేశాడు' అని చెప్పారు చిరు.

అయితే.. అడిగిన సమయం కరెక్ట్ కాదని మీరు భావిస్తున్నారా అని మెగాస్టార్ ని అడిగినపుడు.. 'ఓ ఫీలింగ్ వచ్చాక దానికి టైం.. పరిస్థితులు ఏం చూసుకుంటారు? నాగబాబు వెరీ ఎమోషనల్. అందుకే ఆ రకంగా రియాక్ట్ అయ్యాడు' అంటూ తమ్ముడు వ్యాఖ్యలను సమర్ధించారు చిరు.

అసలు రామ్ గోపాల్ వర్మతో ఈ స్థాయి విబేధాలకు కారణం ఏంటి అనే ప్రశ్నకు చిరు సమాధానం చెబుతూ 'అసలు ఏం లేదు. అతని నేచర్ అది.. ఎవరిమీదైనా అతను అలాగే మాట్లాడతాడు. మా మీద ఏదో లక్ష్యం చేసుకున్నాడని అనుకోను. కానీ ఒకోసారి అనవసరంగా కూడా అనడం ఎందుకు. మనం ఎవరం ఆయన గురించి మాట్లాడలేదు కదా. మరి మనల్ని ఎందుకు ఎయిమ్ చేస్తున్నాడు. నేను ఎలాంటి కేరక్టర్స్ చేయాలి.. ఎలాంటి సినిమాలు చేయాలి.. నా సినిమాలు ఎలా ఉండాలి.. నా సినిమా మీద ఆయన వ్యూహరచన ఏంటి అనేది నాకు అర్ధం కాదు. అందరితో పాటు మేము కూడా సినిమాలు చేస్తున్నాం. కానీ ఆయన మామీదే ఎందుకంత ఫోకస్ చేస్తున్నాడు.. ఎందుకంత దృష్టిపెట్టాడో నాకూ అర్ధం కాదు. బట్ ఆయన నైజం అది. దానికి ఒకోసారి ట్వీట్స్ హర్టింగ్ అనిపించినా.. మనకెందుకులే అనుకున్నాను. కానీ నాగబాబు అలా అనుకోలేదు. తను రియాక్ట్ అయ్యాడు' అంటూ వర్మ కామెంట్స్ పై తన ఫీలింగ్స్ చెప్పారు చిరు.

చిరంజీవితో సినిమా అర్ధాంతరంగా ఆగిపోవడంతో రామ్ గోపాల్ వర్మ ఈ స్థాయిలో రియాక్ట్ అవడానికి కారణమా అనే ప్రశ్న మెగాస్టార్ కు ఎదురైంది. 'కానే కాదు.. ఆ రోజుల్లో అశ్వనీదత్ గారు ప్రొడ్యూసర్ గా నాతోటి రామ్ గోపాల్ వర్మ సినిమా అనుకుని.. కొన్ని సీన్స్.. ఒక పాట షూట్ చేసుకుని ఆ తర్వాత అర్ధాంతరంగా ఆపేశారు. కారణం ఏంటంటే.. సంజయ్ దత్ జైల్ నుంచి విడుదలవుతున్నారు. ఆయనతో ఓ సినిమా చేయాల్సిన కమిట్మెంట్ ఉంది. ఆయన ఇప్పడప్పుడే రిలీజ్ కారు కదా అని నేను ఈ సినిమా ఒప్పుకున్నాను. అప్పుడు దౌడ్ అని సినిమా చేయాల్సి వచ్చింది. అది నాకు తప్పని సరి అన్నారు వర్మ. జస్ట్ ఆ ఒక్క కారణం చెప్పి.. ఖర్చుల విషయంలో అశ్వనీదత్ తో మాట్లాడుకుని.. ఆయనకు నష్టం లేకుండా నేను చూస్తానని మాటవరసకు అన్నారు. ఆ తర్వాత సినిమా ఆగిపోయింది' అంటూ అప్పట్లో ఊర్మిళతో వర్మ డైరెక్షన్ లో మొదలై ఆగిపోయిన సినిమా గురించి చెప్పారు మెగాస్టార్.

'అసలు విషయం బయటపెడతానంటూ వర్మ బెదిరించడం ఆయనకే తెలియాలి. ఏంటా అసలు విషయం. ఇవన్నీ మాటలతో బెదిరించడమే.. చెప్పమనండి. ఎవరైతే సాఫ్ట్ టార్గెట్టో.. ఎవరిని టార్గెట్ చేస్తే తనకు మైలేజ్ వస్తుందో.. ఇంకోటో.. మరి ఏ ఉద్దేశ్యంతో ఏం ఆలోచిస్తారో మాకు తెలియదు. కానీ మాకైతే ఆయన పట్ల ఎలాంటి విబేధాలు లేవు. ఆయనతో మాకు సత్సంబంధాలే కాదు.. అసలు సంబంధాలు కూడా లేవు. ఆయన ఎప్పుడు ఎవరిని ఎవరిని ఎలా కామెంట్ చేస్తారో ఊహించలేం' అన్నారు చిరు.

బహుశా మెగాస్టార్ ఇచ్చిన క్లారిటీతో అసలు ఈ ఎంటైర్ విషయంపై మెగా ఫ్యామిలీ మైండ్ సెట్ ఎలా ఉందో మనకు అర్దమైపోతోంది. అది సంగతి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/